Chandrababu- KCR: సరిగ్గా 4 ఏళ్ల క్రితం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2014 కంటే మరికొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకొని ప్రభుత్వాన్ని మరలా ఏర్పాటు చేసి విజయ గర్వంతో ఊరేగుతున్న రోజులవి. మామూలుగానే కేసీఆర్ అహంభావి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు, ఆయనతో పని చేస్తున్న వాళ్ళు అంటూ ఉంటారు. అతి తక్కువ సార్లు మాత్రమే తగ్గి.. అన్నిసార్లు నేనే నెగ్గాలనుకునే తత్వం కలవాడని చెబుతూ ఉంటారు. అలాంటి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటికే విపక్ష కాంగ్రెస్తో పొత్తు కలుపుకున్న ఒకప్పటి బాస్, ఏపీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఒక ఆట ఆడుతున్నారు. అప్పుడే “రిటర్న్ గిఫ్ట్ కు” తెర లేపారు. ఒక వచనమైనా హిందీలో మాట్లాడగలడా?, ఢిల్లీలో చక్రాలు తిప్పాలంటే వట్టిగనే అవుతుందా? అంటూ దునుమాడారు. ఇదే సమయంలో హైదరాబాద్ ఐటీ కి చంద్రబాబు చేసింది ఏమీ లేదని కేసీఆర్ విమర్శించడం అప్పట్లో పెద్ద సంచలనానికి దారి తీసింది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం సర్వసాధారణం. అని వాస్తవాలను మరుగున పెడితే అసలు విషయాల లోతుల్లోకి వెళ్లాల్సి వస్తుంది.
హైదరాబాద్ ఎందుకు కారణం అంటే
భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల కంటే వాతావరణం భిన్నమైనది. పీఠభూమి ప్రాంతానికి చెందినది కావడంతో కంపెనీలు తమ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడానికి, అన్నింటికంటే ముఖ్యంగా బ్యాకప్ కేంద్రాలు నెలకొల్పేందుకు హైదరాబాద్ వాతావరణం సహకరిస్తుంది. అందుకోసమే పెద్ద పెద్ద ఐటీ సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అసెంజెర్, డెలాయిట్, క్యాబ్ జెమినీ వంటి సంస్థలు తమ మాతృ దేశం తర్వాత ఇక్కడే శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాస్తవానికి ఈ విషయాన్ని 2018లో విలేకర్ల సమావేశంలో కేసీఆర్ చెప్పారు.
Also Read: Menu For Modi: మోడీ విందులో తెలంగాణ రుచులు.. స్పెషల్ మెనూ.. వండిపెట్టేది ఎవరో తెలుసా?
ఐటీ అర్థం మారింది?
ఐటీ అనేది ఇప్పుడు మనిషి జీవనంలో ఒక భాగం అయిపోయింది. అప్పుడు సి లాంగ్వేజ్ వస్తేనే గొప్ప అనుకునే రోజులనుంచి డేటాబేస్, ఒరాకిల్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, రోబోటిక్స్, ఆండ్రాయిడ్ వంటి కొత్త ప్లాట్ఫామ్ లు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా.. ఎంత నైపుణ్యం సాధిస్తే ఆ స్థాయిలో యువతకు జీతాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు Y2K వల్ల ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2008లో ఆర్థిక మాంధ్యం వల్ల ఇబ్బంది పడింది. కానీ ఇప్పట్లో ఐటీ రంగానికి వచ్చిన డోకా ఏమీ లేదు. ఇక ఐటీ రంగం కూడా ద్వితీయశ్రేణి నగరాలు విస్తరిస్తోంది. కంపెనీలు కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎలాగూ తెలంగాణ వాతావరణం వాటి బ్యాకప్ కు అనుకూలం కాబట్టి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండలో కేపీవో, బీపీవో కార్యకలాపాలు తాగి స్తంభాన్ని ప్రతిపాదన పెట్టడంతో.. ఇదే అదునుగా ప్రభుత్వం టీ హబ్ పేరుతో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రతిపాదన కంపెనీలకు నచ్చడంతో పెట్టుబడులు పెడుతున్నాయి. వాస్తవానికి కేపీవో, బీపీవో కార్యకలాపాలు జాతీయ దేశాల నిర్వహించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకే కంపెనీలు తెలివిగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తాయి. పైగా ఇక్కడ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెబితే ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తాయి. దీనివల్ల కంపెనీలకు నిర్వహణ ఖర్చు కూడా పెద్దగా ఉండదు.
మరి కేసీఆర్ ఏం చేసినట్టు?
సైబరాబాద్.. ఒకప్పుడు ఈ ప్రాంతం గుట్టలు కొండలతో నిండి ఉండేది. రాజీవ్ గాంధీ దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ వ్యాప్తిని ప్రోత్సహించేవారు. అప్పట్లో హైదరాబాద్కు ఐటీ ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1992-1994 కాలంలో ప్రతిపాదన రూపొందించారు. ఆ తర్వాత అనేకానేక రాజకీయ పరిణామాల మధ్య అది అటకెక్కింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ఐటీ పైన బాగా దృష్టిసారించారు. అందులో భాగంగానే సైబర్ టవర్స్ కు రూపకల్పన చేశారు. ఆ నిర్మాణ బాధ్యతలు ఎల్ అండ్ టి కి అప్పగించారు. ఎప్పుడైతే సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయిందో అప్పుడే హైదరాబాదులో మరో నగరానికి అంకురార్పణ జరిగింది. అప్పటినుంచి మైక్రోసాఫ్ట్ మొదలుకొని గూగుల్ వరకు ప్రతి కంపెనీ హైదరాబాదును వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే సైబర్ టవర్స్ నిర్మాణంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, మాగంటి మురళీమోహన్ సంస్థ అయిన జయ భేరికి చంద్రబాబు మేళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సైబర్ టవర్ నిర్మించిన l&t కంపెనీ.. చంద్రబాబుకు కృతజ్ఞతగా ఎన్టీఆర్ భవన్ ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు. ఐటీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే వందలాది ఎకరాల భూములను కంపెనీలకు రాయి మీద ఇచ్చారు. ఆ ల్యాండ్ బ్యాంకు బలిష్టంగా ఉండటం వల్లే నేడు కంపెనీలు సుస్థిరమైన వృద్ధిని సాధించగలుగుతున్నాయి. ఎలాగో బ్యాకప్ కేంద్రాలుగా ఉండడంతో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాయి. నాస్కం అంచనా ప్రకారం మరికొద్ది రోజుల్లో దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరును హైదరాబాద్ దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో హైదరాబాద్కు కొత్తగా చేయాల్సింది ఏమీ ఉండదు. ఈ నగరంలో ఐటీ పునాదులు బలంగా ఉండటం, నివాస యోగ్యానికి అత్యంత అనువుగా ఉండటంతో కంపెనీలు తమ ఫస్ట్ ఛాయస్ గా పరిగణిస్తున్నాయి. స్వామికి ప్రభుత్వం టీహబ్ ను ఏర్పాటు చేశామని చెబుతున్నా కంపెనీలు పెడుతున్న పెట్టుబడులే ఇందులో ఎక్కువ. అయితే వీటిల్లో చాలా వరకు కూడా ఔత్సాహికులకు సర్కారు నుంచి పెద్దగా ప్రయోజనం అందడం లేదు. ఒకవేళ గనుక అది అందితే వారు మరింత మెరుగ్గా రాణించగలరు.
కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి
మొన్న హైదరాబాదులో టీ హబ్ 2.0 కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ఇక్కడ సరికొత్తగా స్టార్ట్ ప్ లని పరిచయం చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. కానీ భారతదేశానికి ఇంక్యుబేటర్లు కొత్త కాదు. భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరు, పూణె వంటి నగరాల్లో స్టార్టప్ లు ఎప్పుడో మొదలయ్యాయి. వాటి వల్ల మెరుగైన ఫలితాలు ఉండటంతో మిగతా ఐటీ ప్రాంతాలు కూడా వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ – మాదాపూర్ మధ్య నిర్మించిన టీ హబ్ కేంద్రం 2.0 భారతదేశంలోనే అతిపెద్దది. “టీ హబ్ వన్ పాయింట్ జీరో” కేంద్రం ద్వారా సుమారు 2000 మంది ఔత్సాహికులకు ₹9,399 కోట్ల నిధులు సమకూరాయి. ఇవన్నీ కూడా ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారానే వారికి అందాయి. సైబరాబాద్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ దశ దిశ మారింది. నాటి పునాదుల వల్లే ఐటీ హబ్ వంటి వేదికలు నిర్మాణం అవుతున్నాయి. వాస్తవానికి కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మీద పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ కూడా కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాంటిదే.
Also Read:Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kcr criticized that chandrababu did nothing for hyderabad it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com