https://oktelugu.com/

కేటీఆర్ ఉద్యోగాల ప్రకటన.. షాకవుతున్న నిరుద్యోగులు!

మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది.. కానీ నిజంగా చేతల్లో చూస్తే అన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయా? అన్న అనుమానం రాకమానదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాలపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన చూసి నిరుద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ వేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక గ్రూప్స్ సహా ఉద్యోగ ప్రకటనలు వేసింది చాలా తక్కువ. అవి కోర్టు కేసుల్లో జోన్స్ కారణంగా ఆగిపోయాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2021 / 04:49 PM IST
    Follow us on

    మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది.. కానీ నిజంగా చేతల్లో చూస్తే అన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయా? అన్న అనుమానం రాకమానదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాలపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన చూసి నిరుద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ వేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక గ్రూప్స్ సహా ఉద్యోగ ప్రకటనలు వేసింది చాలా తక్కువ. అవి కోర్టు కేసుల్లో జోన్స్ కారణంగా ఆగిపోయాయి.

    నిరుద్యోగులంతా ఉద్యోగాల భర్తీ ఎప్పుడా అని పిట్టకు పెట్టినట్టు ఎదురుచూస్తున్నారు. చకరో పక్షుల్లా కోచింగ్ సెంటర్ల వైపు పరిగెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ చర్చ తారాస్థాయికి చేరింది. ఉద్యోగాలు ఇవ్వని టీఆర్ఎస్ ను ఓడించాలన్న కసిని నిరుద్యోగులు చూపించారు. ఫలితాల మాట ఎలా ఉన్న టీఆర్ఎస్ ను ఎదురిస్తున్న తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు గుద్దేశారు.

    తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 2014-2020 వరకు 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన రంగాల్లో రాష్ట్రానికి రూ.70వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తద్వారా 3 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.ఇక కొత్తగా రాష్ట్రానికి మరో 40 పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ అన్నారు.

    అయితే ప్రతిపక్షాలు మాత్రం కేటీఆర్ ప్రకటనను ఖండించాయి. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణను కూడా ఉద్యోగాలు ఇచ్చిన జాబితాలో టీఆర్ఎస్ సర్కార్ చూపిస్తోందని విమర్శించాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన కొలువులను కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే అన్ని ఉద్యోగాలు భర్తీ అయితే నిరుద్యోగులు ఇంతలా ఎందుకు అర్రులు చాస్తారని.. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.