Hero Dhanush: నేటి తరం దక్షిణ భారత దేశ స్టార్ హీరోలలో విలక్షణమైన నటులుగా పేర్లు తెచ్చుకున్న అతి కొద్దిమంది హీరోలలో ఒకడు ధనుష్.తమిళం లో ఇతగాడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే.యూత్, మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా అన్ని వర్గాలను అలరించే సినిమాలు తీసి అతి తక్కువ సమయం లోనే స్టార్ గా ఎదిగాడు.అంతే కాదు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టిన చరిత్ర ఉంది గతంలో ఆయనకీ.
అయితే తెలుగు లో మాత్రం మొన్న విడుదలైన ‘సార్’ సినిమాతోనే అరంగేట్రం చేసాడు.ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తే కానీ అర్థం కాలేదు.ధనుష్ కి తెలుగులో ఇంత క్రేజ్ ఉందా అనే విషయం.ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక మాట చెప్తాడు.
‘ఈ సినిమా కేవలం వారం ఆడే సినిమా కాదు..నాలుగు వారాల పాటు ఆడే సినిమా..రాసిపెట్టుకోండి’ అని అన్నాడు.ఆయన మాటలను చూసి ఓవర్ కాంఫిడెన్స్ అని అందరూ అనుకున్నారు.కానీ 22 వ రోజు కూడా 24 లక్షల రూపాయిలను వసూలు చేసేంత రన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఆరు కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది.విడుదలకు ముందు ఆ ట్రైలర్ ని చూసి బ్రేక్ ఈవెన్ అయితే చాలు అని అనుకున్నారు.
కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఈ సినిమా 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి 16 కోట్ల రూపాయలకు పైగా లాభాలను తెచ్చిపెడుతుందని బహుశా ఆ చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఊహించి ఉండరు.నిజమైన ఊర మాస్ అంటే ఇదే..ధనుష్ తదుపరి చిత్రం తెలుగు లో శేఖర్ కమ్ముల తో చేస్తున్నాడు.ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.