
MLC Kavitha- BRS Leaders: లిక్కర్ క్వీన్‌గా బీజేపీ నేతలు సంబోధిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురును ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు పిలిచింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితను అధికారులు విచారణ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ప్రశాంతంగా జరుగుతోంది. కానీ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న హడావుడి ఇప్పుడు ఆ పార్టీకి సానుకులత తీసుకురాకపోగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రజా ధనంతో ఢిల్లీ పర్యటన..
మద్యం కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణచేస్తుండగా ఆమెకు సంఘీభావం తెలుపుతామంటూ తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీబాట పట్టారు. ప్రజా సమస్యలపై ఏనాడూ ఢిల్లీ వెళ్లని నేతలంతా ఇప్పుడు ఢిల్లీఫ్లైటెక్కుతున్నారు. పోనీ వారంతా సొంత డబ్బులతో ఢిల్లీ వెళ్తున్నారా అంటే అదీ కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పర్యటనకు వెళ్లే సందర్భంగా ఆ ఖచ్చంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే అది ప్రజల సొమ్మే. కేవలం ఒక అవినీతి కేసులో ఇరుక్కున్న తమ నాయకురాలిని కాపాడేందుకు ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు వెళ్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజాధనం ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ౖహె దరాబాద్‌లో ఆందోళన..
మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో ఆందళనలు మొదలు పెట్టారు. బండి సంజయ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నామరు. మరోవైపు ఎంపీ మాలోతు కవిత ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్‌ఎస్ నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆందోళనలకు ఉసిగొల్పేలా ప్రకటనలు చేశారు.

ప్రదీప్, ప్రీతీ ఘటనలపై ఒక్క నేత కూడా నోరు మెదపలేదు..
ఇటీవల హైదరాబాద్‌లో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరూ ఈ ఘటనపై నోరు మెదపలేదు. చిరవకు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించలేదు. కేటీఆర్ సానుభూతి తెలిపి చేతులు దులుపుకున్నారు. ఇక పీజీ మెడికల్ స్టూడెంట్, ఓ గిరిజన విద్యార్థిని ప్రతీనాయక్ ఇటీవల సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కూడా అధికార పార్టీ నేతలెవరూ మాట్లాడలేదు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్ బిడ్డ కవిత సాటి మహిళగా కూడా ప్రతీ ఆత్మహత్యను ఖండించలేదు. ఇలాంటి నేతను కాపాడేందుకు బీఆర్‌ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పట్టడం, హైదరాబాద్‌లో ఆందోళన చేయడం తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
