
Delhi Liquor Scam- Congress: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏడాదిగా బీజేపీ, బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ మధ్య ఏడాదిగా ప్రశ్చన్న యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లూ ఈ విసయమై కాంగ్రెస్ ఎలాంటి ప్రకటన చేయాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెలీస కవితను ఈడీ విచారణ చేస్తోంది. ఈనేపథ్యంలో ఈ స్కాంపై కాంగ్రెస్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిని తనపైవపు తిప్పుకుంది.
బయటపెట్టింది మేమే..
ఢిల్లీలో లిక్కర్ స్కాం జరుగుతుందని మొదట గుర్తించింది తామే అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖారే సంచలన ప్రకటన చేశారు. తమ ఫిర్యాదు కారణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని తెలిపారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి కాంగ్రెస్‌వైపు మళ్లింది. ఇన్నాళ్లూ బీజేపీ కక్షసాధిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ తాజా ప్రకటనతో షాక్ అయింది. గులాబీ నేతల నోర్లన్నీ మూగబోయాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకటనతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఖంగుతిన్నారు.

కాంగ్రెస్ ప్రకటనలో నిజమెంత..
ఏడాదిగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లిక్కర్ దందా కేసులో జరుగుతున్న ప్రశ్చన్న యుద్ధంలో ఇన్నాళ్లూ మౌనం పాటించిన కాంగ్రెస్ కవితను ఈడీ విచారణ చేస్తున్న వేల చేసిన సంచలన ప్రకటనతో ఇష్యూ ఒక్కసారిగా డైవర్ట్ అయింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖారే అంతటితో ఆగకుండా దర్యాప్తు వేగవంతం కోసం ఈడీ, సీబీఐతో కేసు దర్యాప్తు కోసం కూడా తమే పట్టుపట్టామని తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న కుటుంబాన్ని ఇంటికి పంపాలని కోరారు. అయితే కాంగ్రెస్ ప్రకటనలో వాస్తవాలు ఎంత అన్నా విషయంపై అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నేతుల ఆరా తీస్తున్నారు.
మొత్తంగా కాంగ్రెస్ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీనిపై బీఆర్‌ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
