Prithviraj: రఘుబాబు ఆశపడి కొన్న 15 ఎకరాలు లాస్.. పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పృథ్వీరాజ్ సినిమాల్లో కొనసాగుతుండగా 2019లో వైసీపీలో చేరారు. ఆ సమయంలో పార్టీ తరుపున జోరుగా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక.. పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు.

Written By: Chai Muchhata, Updated On : November 1, 2023 3:28 pm

Prithviraj

Follow us on

Prithviraj: టాలీవుడ్ కు చెందిన కొందరు నటులు సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ గా ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక తమ వ్యక్తిగత అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట్లో విలన్ గా ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్. ‘ఖడ్గం’ సినిమలో ఆయన చేసిన ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్ తో విపరీతంగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి వివిధ పాత్రల్లో నటించారు. ఓ సినిమాలో హీరోగా కూడా చేసిన పృథ్వీరాజ్ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. ఆయన తాజాగా మరో కమెడియన్ రఘుబాబుపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

పృథ్వీరాజ్ సినిమాల్లో కొనసాగుతుండగా 2019లో వైసీపీలో చేరారు. ఆ సమయంలో పార్టీ తరుపున జోరుగా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక.. పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే కొన్ని ఆరోపణల వల్ల పృథ్వీరాజ్ పదవి పోయింది. ఆ తరువాత తనను కావాలనే ఇరికించారని ఆరోపణలు చేస్తూ వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తూనే.. అప్పుడప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన కమెడియన్ రఘుబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. రఘుబాబు సైతం విలన్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అయితే ఆయన గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ రఘుబాబు ఏపీ విభజన ఏర్పడి అమరావతి రాజధాని ప్రకటించాక అందరిలాగే ఆశపడి 15 ఎకరాలు కొన్నాడని అన్నారు. అప్పుడు మరో కోకాపేట అవుతుందని భావించారన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? అని అన్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమి ప్రభుత్వం వస్తే అమరావతికి వాల్యూ పెరుగుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఏపీ పరిస్థితి చూస్తే బాధేస్తుందని అన్నారు. అమరావతి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. అయితే పృథ్వీరాజ్ తోటి నటుడు రఘుబాబుపై కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఎందుకిలా మాట్లాడారు? అనే చర్చ సాగుతోంది.