OG Movie : శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. పలు చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వస్తాయి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతాయి. అంతకంతకూ ఓటీటీకి ఆదరణకు పెరుగుతుండగా సంస్థలు క్వాలిటీ కంటెంట్ తమ చందాదారులకు అందిస్తున్నారు. ఈ వారం వివిధ భాషలకు చెందిన 11 సినిమాలు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి.
అభినవ్ గోమటం నటించిన మై డియర్ దొంగ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా తన చందాదారుల కోసం ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చింది. ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లిన అభినవ్ గోమటం ప్రియుడిగా మారతాడు. తర్వాత ఎలాంటి పర్యవసానాలు చోటు చేసుకున్నాయి అన్నదే కథ.
అలాగే జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ కీలక రోల్స్ చేసిన సైరన్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒరిజినల్ గా తమిళ చిత్రం అయిన సైరన్ తెలుగుతో కూడా స్ట్రీమ్ అవుతుంది. చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఒక అంబులెన్స్ డ్రైవర్ కథే ఈ సైరన్ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది.
అలాగే పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 సైతం ఓటీటీలోకి వచ్చింది. ఆర్టికల్ 370 నెట్ఫ్లిక్స్ లో నేటి నుండి స్ట్రీమ్ అవుతుంది. అలాగే తమిళ థ్రిల్లర్ రణం అరమ్ తవరేళ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు, సిరీస్ల వివరాలు ఇవే…
1. చీఫ్ డిటెక్టివ్ 1958(కొరియన్ వెబ్ సిరీస్) – హాట్ స్టార్
2. సైరన్ (డబ్బింగ్ మూవీ)- హాట్ స్టార్
3. రెబల్ మూన్ ది స్కార్గివర్ పార్ట్ -2 – నెట్ఫ్లిక్స్
4. ఆర్టికల్ 370- నెట్ఫ్లిక్స్
5. డిమోన్స్ : జీ 5
6. కమ్ చాలు హై – జీ 5
7. ఓర్లాండో బ్లూమ్: టు ది ఎడ్జ్ (వెబ్ సిరీస్)- జియో సినిమా
8. రణం అరమ్ తవరేళ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
9. డ్రీమ్ సినారియో – లయన్స్ గేట్ ప్లే
10. ది టూరిస్ట్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే
11. మై డియర్ దొంగ- ఆహా