OG Movie : ప్రస్తుతం ఇండస్ట్రీ లో యంగ్ డైరెక్టర్లు తమ హవా ను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎప్పుడైతే వాళ్లకు ఒక పెద్ద హీరో దొరికాడో అప్పుడు వాళ్ళ పొటెన్షియాలిటీ మొత్తాన్ని వాడుతూ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయాలనే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘రన్ రాజా రన్’, ‘సాహో’ లాంటి రెండు సినిమాలతో ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుజీత్…
ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి ‘ఓజీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అయితే ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం ఈ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ అవ్వడం కొద్ది వరకు కష్టమనే చెబుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా అనుకున్న డేట్ కి రాకపోతే మాత్రం వాళ్ళు చాలా డిస్సాపాయింట్ అయితే అవుతారు.
అలాగే ఈ సినిమా రిలీజ్ కొంచెం లేట్ అయిన కూడా ఆ తర్వాత కూడా చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు మిగతా హీరోల గురించి కూడా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
మరి ఈ కామెంట్లు సుజీత్ వరకు చేరుతాయా లేదా అనే విషయం తెలీదు గానీ, అనుకున్న డేట్ కి, అనుకున్న టైమ్ కి మాత్రం ఈ సినిమాని దింపాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో సుజీత్ ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాడు. మరి ఆయన తిరిగి వచ్చాక ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని తొందరగా ఫినిష్ చేస్తాడా? లేదంటే ఇంతకు ముందు మాదిరిగానే సినిమా షూటింగ్ చాలా లేట్ చేస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది…