
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల విడుదలైన తానాజీ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఆ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిషర్లు వచ్చే వరకు ఇండియా అనే కాన్సెప్ట్ లేదని అన్నాడు. బ్రిటిషర్లు రాకముందు ఇండియా అనే భావన ప్రజల్లో లేదని సైఫ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ అసలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని.. బ్రిటిష్ వారు రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అంతకు 150 ఏళ్ళ కిందటే వాస్కోడిగామా కొలంబస్ లాంటివారు మన దేశాన్ని ఇండియా అని పిలిచారని నెటిజన్లు రిప్లై ఇచ్చారు.