
జబర్దత్ ఫేమ్, యాంకర్ అనసూయ భరద్వాజ్ నటనలో మరియు అందంతో చిన్న తెర మరియు వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె సుకుమార్ తీసిన రంగస్థలం లో రంగమ్మత పాత్రలో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు అసలు వార్తలు ఏమిటంటే, దర్శకుడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలో అనసుయ నటించబోతుంది. ఈ సినిమాలో అనసూయ నెగటివ్ షేడ్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పాత్ర నచ్చడంతో ప్రతినాయక పాత్ర పోషించడానికి సిద్ధమైపోయింది ఈమె.ఈ సినిమా కథ ఎర్ర చందనం అక్రమ రవాణా చుట్టూ తిరుగుతుందని తెలిసింది. అల్లు అర్జున్ మరియు అనసుయ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రంనికి హైలైట్ గా మిగిలిపోతాయని సినిమా వర్గాలు వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. సైలెంట్‌గా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు సుకుమార్. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాలో రంగమ్మత్త కాస్తా పర్ఫెక్ట్ నెగిటివ్ పాత్ర చేయబోతుంది.