AP Elections 2024: ఏపీలో నిశ్శబ్ద ఓటు ఎటు? ఎగ్జిట్ పోల్స్ ను సర్వే సంస్థలు పసిగట్టగలిగాయా?

Andhra Pradesh: ఇక దేశంలో ఎన్నికలను కాస్త పక్కన పెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి చాలా రోజులు కావస్తోంది. ప్రధాన నాయకులు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఆయా మీడియా సంస్థలు నర్మగర్భంగా ఫలితాలను వెల్లడించే ప్రయత్నం చేశాయి.

Written By: NARESH, Updated On : May 31, 2024 9:34 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: నాయకుల్లో టెన్షన్. కార్యకర్తల్లో ఆందోళన. ప్రజా ప్రతినిధుల్లో ఉత్కంఠ.. ఏం జరుగుతుంది? ఫలితం ఎలా ఉండబోతుంది? ఇన్నాళ్లు వేసుకున్న అంచనాలు నిజం అవుతాయా? అధికారం దక్కుతుందా? లేకుంటే మరో 5 ఏళ్లపాటు మాజీ గానే మిగలాల్సి వస్తుందా? ఇన్ని ప్రశ్నలకు రేపు సాయంత్రం 6 గంటల తర్వాత సమాధానం లభించబోతోంది.. జూన్ 1 సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు ఎన్నికలకు ముందే ఎగ్జిట్ ఫలితాలను దాదాపుగా వెల్లడించాయి. అయితే ఇవన్నీ కూడా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండడం వల్ల.. వాటి పట్ల ప్రజలకు ఏమంత నమ్మకం లేదు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలకు ముందు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదు. అందువల్లే ఆరు దశల్లో ఎన్నికలు ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు వెల్లడించలేదు.
ఇక దేశంలో ఎన్నికలను కాస్త పక్కన పెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి చాలా రోజులు కావస్తోంది. ప్రధాన నాయకులు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఆయా మీడియా సంస్థలు నర్మగర్భంగా ఫలితాలను వెల్లడించే ప్రయత్నం చేశాయి. అయితే ఆ మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఫలితాలను వెల్లడించడంతో.. వాటికంటూ ఒక పారదర్శకత లేకుండా పోయింది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను రూపొందించినప్పటికీ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల వాటిని వెల్లడించలేకపోయాయి.. అయితే ఈ సంస్థలో సైలెంట్ ఓటింగ్ ను దృష్టిలో పెట్టుకున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సైలెంట్ ఓటింగ్ ను దృష్టిలో పెట్టుకొని సర్వే చేస్తేనే.. ఆ ఎగ్జిట్ పోల్స్ కు పారదర్శకత ఉంటుందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చాలా వరకు సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ సునామీని సృష్టిస్తుందని స్పష్టంగా అంచనా వేయలేకపోయాయి. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్  ను పసిగట్టడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. మరి ఈసారి కూడా ఆ సైలెంట్ ఓటింగ్ ను పరిగణలోకి తీసుకున్నాయా? లేకుంటే గుడ్డిగా ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడిస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
ఇక ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికే పడ్డాయని అంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అయితే డబ్బు, అధికారం, కులం, ఉచిత పథకాలు, సోషల్ ఇంజనీరింగ్ వంటివి క్రియాశీలక పాత్ర పోషించాయని.. అందువల్లే ఎగ్జిట్ పోల్స్ ను అంచనా వేయడం సాధ్యం కాలేదని పలు సర్వే సంస్థల నిర్వాహకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. పేరుపొందిన సంస్థలు కూడా ఏపీలో ఎన్నికలకు ముందు పలు దఫాలుగా సర్వే చేసినప్పుడు విభిన్నమైన ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత పలు సంస్థలు చేసిన సర్వేల్లో ఫలితాలు కూడా ఏకపక్షంగా రాలేదని, అధికార పార్టీ అనుకున్నట్టు వేవ్ లేదని, అలాగని ప్రతిపక్షానికి కూడా ప్రజలు ఎర్ర తివాచీ పరచలేదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ సైలెంట్ ఓటింగ్, మహిళల ఓటింగ్ సరళిని ప్రస్ఫుటం చేస్తేనే స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.