Chapathi on Gas : గ్యాస్ మీద రోటీలు కాలుస్తున్నారా.. అయితే కోరి ప్రమాదాన్ని వెతుక్కున్నట్లే!

చపాతీలను ఇలా కాల్చి తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్‌ నుంచి హానికర రసాయనాలు విడుదల అవుతాయని వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చపాతీలు ఇలా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మరి చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 26, 2024 1:15 pm

Chapathi On gas

Follow us on

Chapathi on Gas :  రోజూ చపాతీలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రైస్ కంటే చపాతీలు తినడం వల్ల బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుంది. చపాతీలు చేయడానికి కాస్త సమయం పట్టిన కూడా వీటినే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలామంది ఈరోజుల్లో మల్టీగ్రెయిన్‌ పిండితో తయారు చేసుకుని తింటున్నారు. ఈ పిండితో తినడం వల్ల కండరాలు బలం కావడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే చాలా చపాతీలను పెనం మీద కాలుస్తారు. కానీ కొందరు చపాతీలు మెత్తగా రావాలని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చుతారు. ఇలా చపాతీలు తయారు చేయడం వల్ల బాగా పొంగి.. మెత్తగా ఉంటాయని చేస్తారు. అయితే చపాతీలను ఇలా కాల్చి తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్‌ నుంచి హానికర రసాయనాలు విడుదల అవుతాయని వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చపాతీలు ఇలా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మరి చూద్దాం.

గ్యాస్ నుంచి హానికర రసాయనాలు విడుదల అవుతాయి. దీని నుంచి విడుదల అయ్యే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల శ్వాస, జీర్ణక్రియ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాల వల్ల ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి గ్యాస్ మీద కాల్చిన చపాతీలు తినవద్దు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇలా కాల్చిన రోటీలు తినాలని అనుకుంటే బొగ్గుల మీద కాల్చి తినండి. బొగ్గులు మీద కాల్చి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. చపాతీలు మెత్తగా టేస్టీగా ఉంటాయి. అయితే కొందరు ఆ బొగ్గులను కూడా కల్తీ చేస్తారు. ఎలా అంటే మనుషులను కాల్చిపెట్టిన తర్వాత వచ్చిన బొగ్గులను కూడా అమ్ముతుంటారు. వీటిపై చపాతీలను కాల్చడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కర్రలను కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులను వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి.

చపాతీలను పెనం మీద మాత్రమే కాల్చి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. నేరుగా గ్యాస్ మీద కాల్చడం వల్ల కొన్నిసార్లు ఎక్కువగా మాడిపోతుంది. ఇలా మాడిపోయిన చపాతీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డైలీ రోటీలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గోధుమ పిండిలో కూడా పోషకాలు ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే చపాతీలు తినడం వల్ల బరువు తగ్గుతారు. కండరాలు బలంగా కూడా తయారవుతాయి. రోజుకి కనీసం రెండు నుంచి మూడు చపాతీలు అయిన తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మేలు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.