‘Vidyalakshmi’ loan limit increased: జీవితంలో ఉన్నతస్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే కొందరు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉండవు. దీంతో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత చదువులు చదువుకునేవారికి విద్యారుణాలను అందించాలని నిర్ణయించింది. దీనికి ‘విద్యా లక్ష్మి’ అనే పేరుతో కొత్త పథకాన్ని 2005లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకునేవారు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. అయితే తాజాగా విద్యాలక్ష్మీపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.
విద్యాలక్స్మీ పథకం ద్వారా విద్యార్థులు దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోనే కాకుండా విదేశాల్లో చదివేందుకు రుణ సాయం తీసుకోవచ్చు. దేశంలో 860 విద్యాసంస్థల్లో విద్యార్థులు విద్యాలక్ష్మీ పథకం ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. అయితే ఇప్పటి వరకు విద్యారుణం కింద రూ.7.5 లక్షల వరకు రుణం మాత్రమే అందించింది. ఇది దేశంలోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు. విదేశాల్లో చదివే వారికి రూ.15 లక్షల వరకు లోన్ సదుపాయం అందించేంది.
తాజాగా విద్యాలక్ష్మీ పథకంపై కీలక నిర్ణయం తీసకుంది. విద్యాలక్ష్మీ రుణాన్ని రూ.10 లక్షలకు పెంచింది. దేశంలోని ప్రతీ ఏడాదిలో 22 లక్షల మంది రుణం తీసుకుంటున్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం కలగనుంది. అలాగే బ్యాంకు నుంచి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే ఇందులో 75 శాతం వరకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ లోన్ పై 3 శాతం వడ్డీ రాయితీ కూడా అందించనుంది. ప్రతీ ఏడాది విద్యాలక్ష్మీ పథకం కింద రూ. 3,600 కోట్లు కేటాయిస్తోంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్యాలక్ష్మీ కింద దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ www.vidyalaxmi.co.in/students లోకి వెళ్లాలి. ఆ తరువాత విద్యార్థులు తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక ఎడ్యుకేషన్ లోన్ పై క్లిక్ చేయాలి. ఇందులో CELAFఅనే ఫాం ఉంటుంది. దీనిని జాగ్రత్తగా నింపాలి. ఈ ఫాంను నింపడం ద్వారా మూడు బ్యాంకులకు లోన్ అప్లికేషన్ వెళ్తుంది. బ్యాంకులు వివరాలు పరిశీలించి విద్యాలక్ష్మీ పథకం కింద రుణాలను జారీ చేస్తారు.
అయితే విద్యారుణం తీసుకున్న తరువాత సరైన సమయంలో తిరిగి చెల్లంచాల్సి ఉంటుంది. అయితే లోన్ అప్లయ్ కావాలంటే మాత్రం అధార్ కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు తదితర వివరాలు కావాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎడ్యుకేషన్ కు సంబంధించి ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. ఇందులో ఏ విద్యాసంస్థల్లో చదువుతున్నారోు. దాని గురించి పూర్తి డీటేయిల్స్ అందించాలి. ఆ తరువాత విద్యారుణం మంజూరు అవుతుంది. అయితే ఒకేసారి కాకుండా విడదల వారీగా నగదు సంబంధిత బ్యాంకులో జమ అవుతుంది.