America Election Result 2024 : తెలుగులో ప్రముఖ న్యూస్ చానల్స్ లో ఏబీఎన్ ఒకటి. ఇది చంద్రబాబు డబ్బు కొట్టే చానల్స్ లో ప్రముఖంగా ఉంటుంది. చంద్రబాబు అనగానే ఈ ఛానల్ కు వీరా వేశం పొంగుకు వస్తుంది. గిట్టని పార్టీల మీద నిర్లజ్జగా బురద చల్లుతూ ఉంటుంది. ఆ తర్వాత కడుక్కోవడం మీ ఖర్మ అని వదిలేస్తుంది. ఏబీఎన్ ఛానల్ యాజమాన్యమే కాదు, అందులో పని చేసే కొంతమంది పాత్రికేయులు కూడా అలానే వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఏబీఎన్ ఎలాంటి వార్తలు ప్రసారం చేసిందో, ఎలాంటి విశ్లేషణలు చేసిందో అందరికీ తెలుసు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏబీఎన్ అంతకుమించి అనేలాగా చంద్రబాబు ను కీర్తిస్తోంది. కండూతి వ్యవహారాలను దర్జాగా సాగిస్తోంది.. ఇదంతా ఆ ఛానల్ మేనేజ్మెంట్ ఇష్టం అనుకుందాం.. ఆయన తెలుగు మాట న్యూట్రల్ మీడియా ఏది ఉంది గనుక.. ఏదో ఒక పార్టీకి డప్పు కొట్టడం. ఏదో ఒక ప్రభుత్వానికి భజన చేయడం పరిపాటిగా మారింది. అసలు ఇలాంటి వ్యవస్థలో న్యూట్రల్ అనే పదం పలకడమే బూతు లాగా మారిపోయింది.. అయితే ఏబీఎన్ లో వెంకటకృష్ణ అనే పాత్రికేయుడు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ప్రైమ్ టైం డిబేట్ లలో ఎక్కువగా కనిపిస్తుంటారు. వర్తమాన అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు. ఒక్కోసారి లైన్ దాటుతారు. దానిని వైసీపీ నాయకులు క్యాచ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. విమర్శలు చేస్తుంటారు.
అనవసరంగా ట్వీట్ చేసి..
వెంకటకృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్ లో ఆయన తనదైన శైలిలో ట్వీట్లు చేస్తుంటారు.. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వెంకటకృష్ణ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ట్రంప్ గెలుస్తాడని వార్తలు వచ్చాయి. మధ్యలో కమలకు కాస్త ఎడ్జ్ ఉన్నప్పటికీ.. చివర్లో ట్రంప్ పుంజుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుస్తారని వెంకటకృష్ణ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వైయస్ జగన్ ను ట్యాగ్ చేశారు. అయితే వెంకట కృష్ణ ఊహించినట్టుగా అమెరికా అధ్యక్ష ఫలితం రాలేదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో ట్రంప్ గెలిచారు. దీంతో వైసీపీ శ్రేణులు వెంకటకృష్ణతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ” తాగి ట్వీట్ చేస్తే ఇలానే ఉంటుంది.. అక్కడ వాడింది ఈవీఎంలు కాదు.. నీలాంటి వాళ్ల వల్ల జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు” అని వైసీపీ శ్రేణులు వెంకటకృష్ణను ఉద్దేశించి విమర్శించడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ ను ట్యాగ్ చేయడం వల్లే తాము స్పందించాల్సి వస్తోందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.. మొత్తంగా కమల ఓటమి.. ఏబీఎన్ వెంకటకృష్ణకు తల బొప్పి కట్టించింది. చాలా రోజులుగా వెంకటకృష్ణను ఒక ఆట ఆడుకుంటున్న వైసీపీ శ్రేణులు.. బుధవారం మరింత రెచ్చిపోయాయి. ఆయన చేసిన ట్వీట్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నాయి.