https://oktelugu.com/

YCP MLA’s : 9 కి తగ్గనున్న వైసిపి బలం..పక్క చూపులు చూస్తున్న ఆ ఇద్దరు ఎవరు?

వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగింది వైసిపి. కానీ ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ఇప్పుడు ఆ బలం మరో రెండు సంఖ్యలు తగ్గనున్నట్లు సమాచారం.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 / 05:21 PM IST

    TDP MLA's

    Follow us on

    YCP MLA’s :  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుందా? లేదా? అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ భేటీ జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు వైసిపి అధినేత జగన్ సభకు వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వైసిపి హాజరుపై ఓ రేంజ్ లో ర్యాగింగ్ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కొనున్నాయి. దీంతో వైసీపీ నెంబర్ 11 ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నేటిజెన్లు. ఆ 11 మంది హాజరవుతారా? ఆ నాయకుడు హాజరవుతాడా? అంటూ కూటమి పార్టీల శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. ప్రమాణ స్వీకారం రోజు వచ్చిన ఎమ్మెల్యే జగన్ కొద్దిసేపు సభలో ఉండి వెళ్ళిపోయారు. గత శాసనసభకు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారు. ఈసారి సమావేశాలకు వస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

    * కూటమిపై వ్యతిరేక ప్రచారం
    ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ హోం శాఖ పనితీరును తప్పుపట్టారు. అప్పటినుంచి వైసిపి రెచ్చిపోతుంది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని చెబుతోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శిస్తోంది. అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అయితే వైసీపీ దూకుడుకు కళ్లెం వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు భారీ స్కెచ్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీని ఇరుకున పెట్టేలా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

    * జగన్ ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టాలని
    మరోవైపు వైసీపీ ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాక్కోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు.. రాయలసీమ నుంచి ఒక ఎమ్మెల్యే టిడిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ జగన్ శాసనసభకు హాజరైన ఏమీ మాట్లాడకుండా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి వైపు వస్తే వైసిపి ఆత్మరక్షణలో పడడం ఖాయం. అందుకే వైసీపీని ఇరుకునపెట్టే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.