
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. 838 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా జులై 27 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీబీఎస్ పాస్ కావడంతో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
2021 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఇతరులకు మాత్రం 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. 2021 సంవత్సరం నవంబర్ 21వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు త్వరగా ధరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.