TSPSC Paper Leak : టీ ఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ: నిందితుల ఇంట్లో సిట్ సోదాలు: లక్షల్లో డబ్బు లభ్యం!?

TSPSC Paper Leak : టీ ఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి.. ఇప్పటికే ఈ కేసులో రేణుక రాథోడ్, డాక్యా నాయక్, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాకుండా ఇంకా చాలామంది అరెస్టు అయ్యారు.. వీరిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. సీన్ రీ_ కన్స్ట్రక్షన్ కోసం మార్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఇది […]

Written By: Bhaskar, Updated On : March 28, 2023 2:28 pm
Follow us on

TSPSC Paper Leak : టీ ఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి.. ఇప్పటికే ఈ కేసులో రేణుక రాథోడ్, డాక్యా నాయక్, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాకుండా ఇంకా చాలామంది అరెస్టు అయ్యారు.. వీరిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. సీన్ రీ_ కన్స్ట్రక్షన్ కోసం మార్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఇది చాల దన్నట్టు ఈ కేసులో రోజుకో రకంగా కొత్త పేరు వినిపిస్తోంది.

14 మందిని ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అరెస్టు చేసింది. సోమవారం తిరుపతయ్య అనే మరో నిందితుడిని సెట్ అధికారులు అరెస్టు చేశారు. ఇతడితో కలిపి ఇప్పటివరకు ఈ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15 మందికి చేరుకుంది. ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు అంతు పట్టకుండా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే అరెస్టు అయిన వారు చెబుతున్న వివరాల ప్రకారం ప్రశ్న పత్రాలు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారినట్టు అవగతమవుతోంది. స్థూలంగా చూస్తే భారీగా డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రశ్న పత్రాలు కొనుగోలు చేసిన వారు డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా రకరకాల పన్నాగాలు పన్నారు. ముఖ్యంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేవారిని బుట్టలో వేసుకున్నారు. వారికి ప్రశ్నపత్రాలు ఎర చూపించి భారీగా డబ్బులు దండుకున్నారు.

సోమవారం అరెస్టు అయిన తిరుపతయ్య వివరాలను మంగళవారం సిట్ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నేరెళ్ల చెరువు గ్రామానికి చెందిన రాజేందర్ కుమార్ ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించడంలో తిరుపతయ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవాబ్ పేట కార్యాలయంలో ఈసీగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డి వద్ద 10 లక్షల కు బేరం కుదుర్చుకొని రాజేందర్ దానిని విక్రయించినట్టు సమాచారం. పేద కుటుంబానికి చెందిన రాజేందర్ అప్పు చేసి మరీ ఐదు లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. మిగిలిన ఐదు లక్షలు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

మీరు మాత్రమే కాకుండా మరో ముగ్గురు అనుమానితుల పేర్లు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వారు కూడా సిట్ అధికారుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీ వర్గాల సమాచారం. లీకేజీ వ్యవహారంలో వీరి పాత్ర పై కూడా ఆధారాలు లభిస్తే వీరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది..ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి తో పాటు రేణుక భర్త డాక్యా నాయక్, తమ్ముడు రాజేశ్వర్ లను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వెలుగులోకి వస్తున్న సమాచారం మేరకు మరోసారి వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు, ఈ సోదాల్లో లక్షల్లో డబ్బు లభ్యమైనట్టు తెలుస్తోంది.