NBK 109: బాలయ్య వేటకి దీటైన విలన్ దొరికాడు…ఇక పాన్ ఇండియా లో రచ్చ రచ్చే..

ఆయన ఒక్క డైలాగ్ చెప్పకుండానే తన విలనిజాన్ని పండించాడు. అయితే ఈ సినిమాలో ఈయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : April 24, 2024 11:43 am

bobby deol as villain in NBK 109

Follow us on

NBK 109: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలు అతన్ని తారా స్థాయిలో నిలబెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథ లను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని సీనియర్ హీరోలేవరికీ సాధ్యం కానీ విధంగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ‘ఎన్.బి.కె 109’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అనిమల్ సినిమాలో బాబీ డియోల్ పాత్ర చాలా బాగుంటుంది.

ఆయన ఒక్క డైలాగ్ చెప్పకుండానే తన విలనిజాన్ని పండించాడు. అయితే ఈ సినిమాలో ఈయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈయన రీసెంట్ గా ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టాడు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం… ఇక ఇప్పటికే ఈ సినిమాలో ‘దుల్కర్ సల్మాన్’, ‘షైన్ టామ్ చాకో’ లు కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాలో రోజురోజుకి స్టార్ కాస్టింగ్ అనేది పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు హీరోగా, బాబీ డియోల్ విలన్ గా వస్తున్న ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుందని నందమూరి అభిమానులు చాలా మంచి అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవికి వాల్తేరు వీరయ్య రూపంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన బాబీ. ఇక ఇప్పుడు బాలయ్య బాబుకి కూడా ఒక మంచి సక్సెస్ ని ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…

ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘వీరమాస్ ‘ అనే టైటిల్ ను పెట్టినట్టుగా అఫిషియల్ గా సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది…