TS DSC Notification 2024: ఎస్జీటీ పోస్టులకు వారే అర్హులు..!

మార్చి 4న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్‌ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్‌ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు.

Written By: Raj Shekar, Updated On : March 5, 2024 8:49 am

TS DSC Notification 2024

Follow us on

TS DSC Notification 2024: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన విడుదలైంది. 11,062 పోస్టులతో విద్యాశాఖ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఇక ఈ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఈడీ చేసి టెట్‌ పేపర్‌–2లో అర్హత సాధించిన వారికి ఎస్జీటీ అవకాశం లేదని పేర్కొంది. బీఈడీ చేసినవారంతా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే అర్ములని తెలిపింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ ఈ విధివిధానాలను రూపొందించింది.

నియామకం ఇలా..నియామక విధానం
డీఎస్సీలో రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్‌ వెయిటేజ్‌ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసుకుంటారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్‌ పొంది టెట్‌ పేపర్‌ 2 ఉత్తీ ర్ణులై ఉండాలి. ఇక భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మీడియెట్‌ (రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. పేపర్‌–1 టెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్‌ చేయాలి.

దరఖాస్తులు షురూ..
మార్చి 4న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్‌ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్‌ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్‌ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్‌ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

వయో పరిమితి
మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005, జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్‌ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్‌ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.