Homeఎడ్యుకేషన్TG DSC Results 2024: తెలంగాణ డీఎస్పీ ఫలితాలు విడుదల.. 1:3 ప్రకారం రిజల్స్‌!

TG DSC Results 2024: తెలంగాణ డీఎస్పీ ఫలితాలు విడుదల.. 1:3 ప్రకారం రిజల్స్‌!

TG DSC Results 2024:  తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన తొలి డీఎస్సీ – 2024 ఫలితాలను ప్రకటించింది. మార్చి 1న నోటిఫికేషన్‌ విడుదల చేయగా, జూలై 18 నుంచి ఆగస్టు 3 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సెక్రేటియేట్‌లో విడుదల చేశారు. ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఎం రిజల్ట్స్‌ ప్రకటించారు.

మెగా డీఎస్సీ..
తెలంగాణ మెగా డీఎస్సీగా 11,062 పోస్టులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేన్‌ ఇచ్చింది. ఇందులో స్కూల అసిస్టెంట్‌ పోస్టులు 2,629 ఉండగా, లాంగ్వేజ్‌ పండిత్‌ పోస్టులు 727 ఉన్నాయి, ఎస్జీటీ పోస్టులు 6,509 పోస్టులు, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులు 220 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులు 796 ఉన్నాయి. 2017 తర్వాత మళ్లీ డీఎస్సీ నిర్వహించడం ఇదే తొలిసారి.

రికార్డు సమయంలో ఫలితాలు..
ఇదిలా ఉంటే… తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,45,263 మంది పరీక్షలు రాశారు.34,694 మంది గైర్హాజరయ్యారు. అత్యధికంగా ఎస్జీటీ పోస్టులకు 99.10 శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరాగా పోస్టులు భర్తీ చేయాలన్న లక్ష్యంతో పరీక్ష నిర్వహించిన 56 రోజుల రికార్డు సమయంలో ఫలితాలను ప్రకటించింది. ప్రాథమిక కీని ఆగస్టు 13, ఫైలన్‌ కీని సెప్టెంబర్‌ 6న విడుదల చేసింది. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 30న విడుదల చేసింది. 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అక్టోబర్‌ 9లోగా పోస్టింగ్‌ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఖాళీలను బట్టి 33 జిల్లాలో ధ్రువ పత్రాల పరిశీలన చేస్తారు. ఫలితాలను htt://schooledu.telangana.gov.in/ISMS/ లేదా htt://tgdsc.aptonline.in/tgdsc/ లో చెక్ చేసుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version