Devara Collection: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి రోజు వసూళ్లు ట్రేడ్ కి పెద్ద షాక్. ఒక్క ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అని అనుకున్న వసూళ్లు ఎన్టీఆర్ కి కూడా వచ్చాయి. దీంతో పాన్ ఇండియన్ చిత్రాలు మన టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తే ఇలాంటి వసూళ్లే వస్తాయని ‘దేవర’ చిత్రంతో మరోసారి రుజువు అయ్యింది అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇందులో చూద్దాము. ముందుగా నైజాం ప్రాంతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ చిత్రం ఇక్కడ మూడు రోజులకు కలిపి 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయలకు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసారు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా పని దినాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. కానీ నేడు మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ ని చూస్తుంటే అది అసాధ్యం అనే విషయం అర్థం అవుతుంది. హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్స్ కూడా కానీస స్థాయి ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకోలేదు. కానీ సాయంత్రం షోస్, సెకండ్ షోస్ మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్ లోనే అద్భుతమైన పెర్ఫార్మన్స్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తూర్పు గోదావరి జిల్లాలో 5 కోట్ల 20 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 50 లక్షలు, కృష్ణ జిల్లాలో 5 కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 7 కోట్ల 50 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 2 కోట్ల 70 లక్షల రూపాయిలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకి మూడు రోజుల్లో 76 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక ప్రాంతం లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ వెర్షన్ లో 11 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలాగే తమిళనాడు ,కేరళ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కేవలం 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు కలిపి 124 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్ గా 180 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 56 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి.