TG DSC Results 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన తొలి డీఎస్సీ – 2024 ఫలితాలను ప్రకటించింది. మార్చి 1న నోటిఫికేషన్ విడుదల చేయగా, జూలై 18 నుంచి ఆగస్టు 3 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సెక్రేటియేట్‌లో విడుదల చేశారు. ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఎం రిజల్ట్స్ ప్రకటించారు.
మెగా డీఎస్సీ..
తెలంగాణ మెగా డీఎస్సీగా 11,062 పోస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేన్ ఇచ్చింది. ఇందులో స్కూల అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా, లాంగ్వేజ్ పండిత్ పోస్టులు 727 ఉన్నాయి, ఎస్జీటీ పోస్టులు 6,509 పోస్టులు, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796 ఉన్నాయి. 2017 తర్వాత మళ్లీ డీఎస్సీ నిర్వహించడం ఇదే తొలిసారి.
రికార్డు సమయంలో ఫలితాలు..
ఇదిలా ఉంటే… తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,45,263 మంది పరీక్షలు రాశారు.34,694 మంది గైర్హాజరయ్యారు. అత్యధికంగా ఎస్జీటీ పోస్టులకు 99.10 శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరాగా పోస్టులు భర్తీ చేయాలన్న లక్ష్యంతో పరీక్ష నిర్వహించిన 56 రోజుల రికార్డు సమయంలో ఫలితాలను ప్రకటించింది. ప్రాథమిక కీని ఆగస్టు 13, ఫైలన్ కీని సెప్టెంబర్ 6న విడుదల చేసింది. తుది ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేసింది. 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అక్టోబర్ 9లోగా పోస్టింగ్ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఖాళీలను బట్టి 33 జిల్లాలో ధ్రువ పత్రాల పరిశీలన చేస్తారు. ఫలితాలను htt://schooledu.telangana.gov.in/ISMS/ లేదా htt://tgdsc.aptonline.in/tgdsc/ లో చెక్ చేసుకోవచ్చు.