Telangana: తెలంగాణాలో గ్రూప్-2 పరీక్షలు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-2కి పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఎంతగానే ప్రిపేర్ అయ్యారు. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్ల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్లు ఉంటారు. ఈ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. ఈ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లు రెండు రోజులు జరగనున్నాయి. ఈ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. కొందరు అభ్యర్థులు జాగ్రత్త తీసుకోకుండా చేసిన కొన్ని తప్పుల వల్ల పరీక్ష రాయకుండా పరీక్ష సెంటర్ నుంచి తిరిగి వచ్చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి చదివి పరీక్ష రాయకపోతే ఎంతో బాధగా ఉంటుంది. కాబట్టి పరీక్ష రాయాలంటే కొన్ని సూచనలు పాటించాలి. మరి ఆ సూచనలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
రెండు రోజులు.. నాలుగు పేపర్లు
గ్రూప్-2 పరీక్ష రెండు రోజుల పాటు మొత్తం నాలుగు పేపర్లలో జరగనుంది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్-1 ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. తర్వాత రెండో పేపర్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5:30 వరకు పరీక్ష జరగుతుంది. ఇదే సమయాల్లో 16వ తేదీన కూడా పరీక్షలు జరుగుతాయి. ప్రతీ పేపరులో ఒక్కో పేపరు 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.
ఇవి తీసుకెళ్లకూడదు
గ్రూప్-2 పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. కాబట్టి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి. అలాగే హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. కొందరికి హాల్‌టికెట్‌లో ఫొటో బ్లర్ ఉంటుంది. అలాంటి వారు మూడు పాస్‌ఫొటోలను తప్పకుండా తీసుకెళ్లాలి. పాత పాస్ పోర్ట్ కాకుండా గత మూడు నెలల లోపలది అయి ఉండాలి. పరీక్ష్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అంటే ఉదయం 8:30 గంటల పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తారు. 9:30 లోపల వరకు మాత్రమే పరీక్ష సెంటర్‌లోకి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత వెళ్లిన లోపలికి అనుమతించరు. మధ్యాహ్న సమయాల్లో అయితే 1:30 నుంచి 2:30 వరకు మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తారు. పరీక్ష రాసే అభ్యర్థులు చేతులకు మెహందీ, గోరింటాకు, తాత్కాలికమైన టాటూలు వంటివి ఉండకూడదు. వీటితో వెళ్తే పరీక్ష రాయకుండా తిరిగి వస్తారు. వీటితో పాటు పరీక్ష సెంటర్‌లోకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్లూ టూత్, పెన్ డ్రైవ్ వంటివి కూడా అనుమతించరు. అమ్మాయిలు చైన్, గాజులు, రింగులు, బొట్టు, హ్యాండ్ బ్యాగ్, వాచ్, రబ్బరు బ్యాండ్ వంటివి ధరిస్తే పరీక్ష సెంటర్‌లోకి అనుమతించరు.