Homeఎడ్యుకేషన్ప్రముఖ యూనివర్సిటీలో టీచింగ్ జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?

ప్రముఖ యూనివర్సిటీలో టీచింగ్ జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ టీచింగ్ లో అనుభవం ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. మొత్తం 88 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 88 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్లు, అసొసియేట్‌ ప్రొఫెసర్లు, మోడల్ స్కూల్ టీచర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టీచింగ్ లో అనుభవంతో పాటు పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కనీసం 55 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. మోడల్ స్కూల్ టీచర్ పోస్టులలో భాగంగా హెడ్‌ మాస్టర్‌, టీజీటీ, పీజీటీ, యోగా టీచర్‌, ప్రైవరీ టీచర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని బోగట్టా. బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత పొందిన వాళ్లు మోడల్ స్కూల్ లో టీచర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రార్, రూమ్‌ నెం10, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దు యూనివర్సిటీ, ఉర్దు యూనివర్సిటీ రోడ్‌, గచ్చిబౌలి, హైదరబాద్‌ 500032 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు. అకడమిక్‌ అర్హత, పని అనుభవంను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

https://manuu.edu.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version