Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: ఏపీకి మరో ఉపద్రవం.. పుట్టుకొచ్చిన కొత్త పురుగు..

Andhra Pradesh: ఏపీకి మరో ఉపద్రవం.. పుట్టుకొచ్చిన కొత్త పురుగు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అన్నపూర్ణగా పేరుగాంచింది. అయితే ఇటీవల కాలంలో పంట ఉత్పాదకత తగ్గిపోతుంది. విపరీతంగా మందులు పిచికారీ చేయడంతో భూములు జవసత్వాలను కోల్పోతున్నాయి. మరోపక్క చీడపురుగుల బెదడ తీవ్రమైంది. తాజాగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఓ కొత్త రకం పురుగు. ఇది ఒక్కసారి పంటపొలాల్లో ఎంటరైంది అంటే రైతులు ఆశలు వదులుకోవాల్సిందే. అంతలా పంటను నాశనం చేస్తోంది. అసలు ఈ పురుగు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అనేదానిపై రైతుల్లో చర్చకు దారితీసింది.

Andhra Pradesh
Andhra Pradesh Farmers

ఈ కొత్తరకం పురుగు ఏపీలోనే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రల్లో కూడా ఎంటరైనట్లు సమాచారం. మిరప, మామిడి, కంది, పెసలు, శనగ, పత్తి, వంగ, మునగ ఇలా పంట ఏదైనా ఈ పురుగు ధాటికి నాశనమైపోతుంది. దీంతో ఈ పురుగుపై ప్రభుత్వం స్పందించింది.

ఈ కొత్తరకం పురుగు పుట్టుక, దాని ప్రభావం తీరును తెలుసుకోవడానికి జాతీయ ప‌రిశోధ‌నా సంస్థలను రంగంలోకి దించింది. వ్యవసాయ శాస్త్ర‌వేత్తల ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌ల్లో ‘త్రిప్స్‌ పార్విస్పైనస్‌’ అని గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఇది కొత్త రకం తామర పురుగని.. పంట‌లతో సంబంధం లేకుండా లేత చిగురుల‌ను తినేస్తుందని శాస్త్ర‌వేత్తలు వెల్లడించారు.

Also Read: కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం ఎలా మారనుంది..?

మొదట దీన్ని సాధారణ తామర పురుగు అని భావించామని.. అయితే పరిశోధనల్లో అసాధారణ తామర పురుగు అని తేలిందని వారు తెలిపారు. ఇది పంట‌ల ఆకులపైకి చేరి వాటి రసాన్ని పీల్చి.. పంట‌ను నాశనం చేస్తోంది. సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ ట్రిప్స్‌లో ఒకటైన ట్రిప్స్‌ పార్విస్పైనస్ రకానికి చెందినది అని, ఇది ఇండోనేషియా నుంచి 2015లో మనదేశంలోకి వచ్చి ఉంటుందని శాస్త్ర‌వేత్తలు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ‌గా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో ఉంద‌ని వ్యవసాయ శాస్త్ర‌వేత్తల బృందాలు పర్యటించి శాంపిల్స్‌ సేకరించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం నేషనల్‌ బ్యూరో ఫర్‌ అగ్రికల్చర్‌ ఇన్‌సెట్‌ రీసోర్సెస్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Also Read: త్వ‌ర‌లోనే రంగంలోకి టీడీపీ వాలంటీర్లు.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్‌

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version