ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కలబంద చెక్ పెడుతుందని చెబుతున్నారు. మన నిత్య జీవితంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కలబందను ఇంగ్లీష్ లో అలోవెరా అని పిలుస్తారు. అధిక బరువు సమస్యతో బాధ పడేవాళ్లకు అలోవెరా అద్భుతంగా పని చేస్తుంది.
ఎక్కువ నీరు అవసరం లేకపోయినా పెరిగే ఈ ఎడారి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలబంద రసం రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. కలబంద రసంలో టోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఎంతగానో సహాయపడతాయి. కలబందను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అదనపు కొవ్వు కరిగిపోవడంతో పాటు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఒక కప్పు నీటిలో టేబుల్ స్పూన్ కలబంద రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం వేసి సన్నని మంటపై వేడి చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కలబందలో చర్మాన్ని మృదువుగా మార్చే లక్షణాలు, తక్కువ సమయంలో గాయాలను మాన్పించే గుణాలు ఉన్నాయి. వాతావరణంతో సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా కలబంద మొక్క పెరుగుతుంది.
కొబ్బరి నూనె, అలోవెరా గుజ్జు కలిపి తీసుకుంటే చుండ్రు సమస్య దూరం కావడంతో పాటు జుట్టు మిలమిలా మెరుస్తుంది. గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తీసుకుంటే కడుపులోని చెడు పదార్థాలు అన్నీ దూరమవుతాయి. స్నానానికి 5 నిమిషాల ముందు అలోవెరా గుజ్జును తీసుకుని శరీరంపై రాసుకుంటే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఇతర క్రిములు తొలగిపోతాయి.