విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం కొద్దికొద్దిగా రాజుకుంటోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరుగా ఉద్యమం ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు విశాఖలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదం నాడు వీధుల్లో మార్మోగితే.. నేడు ‘విశాఖ ఉక్కు.. -ఏపీ భవిష్యత్’ అంటూ ఉద్యమకారులు ఏపీ అంతటా నినదిస్తున్నారు. సాగర తీరం నుంచి ఈ ఉద్యమం ఆంధ్ర దేశం నలుమూలలా విస్తరిస్తోంది. రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని నడిపేందుకు కలిసికట్టుగా నడవాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే బంద్‌కు పిలుపునివ్వాలని భావిస్తున్నారు.
Also Read: ‘బాస్’ మనసులో ఏముంది..? ఉత్కంఠగా గులాబీ శ్రేణులు..
కేంద్రం ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయించింది. దీంతో అప్పటి నుంచి ఆ అంశం రాష్ట్రంలో పెద్ద చర్చకే దారితీసింది. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం నాటి పోరాటాలను గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరిలో పోరాట పటిమ పెరుగుతోంది. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు ఒక్క విశాఖలోనే కాదు ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ అందరూ కలిసివచ్చారు. ఆదిలాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో కొంత మంది ప్రాణత్యాగం చేశారు. అమృతరావు అనే గుంటూరు ఉద్యమకారుడు.. ప్రాణత్యాగం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాడు ఉద్యమం నలుదిశలా ఉవ్వెత్తున ఎగసిపడింది. అందుకే స్టీల్ ప్లాంట్ సాధ్యమైంది.
అప్పటి పరిస్థితులను ఇప్పటి ప్రజలకు గుర్తుచేస్తున్నారు పలువురు ఉద్యమాకారులు. అంతేకాదు.. అప్పట్లో ఫ్యాక్టరీ కోసం ఎంతో మంది భూములను ధారాదత్తం చేశారు. ఇప్పుడు ఆ చర్చ కూడా ప్రారంభమైంది. భూములిచ్చిన వారిని.. త్యాగాలు చేసిన వారిని గుర్తుచేసుకుంటూ మలి ఉద్యమానికి రెడీ అయిపోతున్నారు. నష్టాల పేరుతో పరిశ్రమల్ని తెగనమ్మడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విశాఖ ఆందోళనలకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయ నేతల మద్దతు ఇప్పుడు ఈ ఉద్యమానికి కీలకం. ఎవరు ఉద్యమాన్ని నడిపిస్తారో వారి ద్వారానే ఇప్పుడు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి.
Also Read: ఎమ్మెల్యేల వల్లే టీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితా..?
విశాఖ ఉక్కు ఉద్యమం ఇప్పటివరకూ ఆంధ్రుల్ని పట్టిపీడిస్తున్న జడత్వాన్ని వదిలించే అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏం కోల్పోయినా.. ఆ ప్రాంతం.. ఆ వర్గం అంటూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం సాగించాయి. దీంతో అనుకున్నట్లుగా ఉండిపోతున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారే సూచనలే కనిపిస్తున్నాయి. ఏదైనా మనదే అనుకునే పరిస్థితి ఇప్పుడు ఏపీ ప్రజల్లో కనిపించడం ప్రారంభమైంది. అయితే.. ఆ సెంటిమెంట్ కాస్త ఎంతలా పెరిగితే ఉద్యమం అంతలా రాజుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్