https://oktelugu.com/

SSC CGL Result 2024: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ – 204 రిజల్ట్స్‌ : టైర్‌ 1 స్కోర్‌కార్డ్‌లను ఇలా పొందాలి..!

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ –2024 ఫలితాలు విడుదలయానున్నాయి. అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in లో తనిఖీ చేయవచ్చు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 5, 2024 / 10:50 AM IST

    SSC CGL Result 2024

    Follow us on

    SSC CGL Result 2024: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌) టైర్‌ 1 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in అడ్మిట్‌ కార్డ్‌లపై పేర్కొన్న వారి రోల్‌ నంబర్‌లను ఉపయోగించి వాటిని తనిఖీ చేయవచ్చు. కమిషన్‌ ఇప్పటి వరకు సీజీఎల్‌ ఫలితాల ప్రకటన తేదీ లేదా సమయాన్ని పేర్కొనలేదు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌1 పరీక్షలు సెప్టెంబర్‌ 9 నుంచి 26 వరకు జరిగాయి. ప్రాథమిక కీని అక్టోబర్‌ 4న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత అక్టోబర్‌ 8న ఫైనల్‌ కీ విడుదలైంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 శాతం సాధించాలి, బీసీ, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 25 శాతం అవసరం.అయితే అన్ని ఇతర కేటగిరీ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కులు 20 శాతంగా నిర్ణయించబడింది. టైర్‌ 1 పరీక్షలో నాలుగు సబ్జెక్టులను కవర్‌ చేసే ఆబ్జెక్టివ్‌ బహుళ–ఎంపిక ప్రశ్నలు ఉన్నాయి. జనరల్‌ అప్టిట్యూడ్, తార్కికం, సాధారణ అవగాహన, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కాంప్రహె న్షన్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగారు.

    17,7772 ఉద్యోగాలు..
    ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ద్వారా గ్రూప్‌–బీ, గ్రూప్‌–సీ విభాగాల్లోని మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు పరీక్ష రాశారు. ఈ పోస్టులను టైర్‌–1, టైర్‌–2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే..
    అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌
    ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌
    అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఇన్‌స్పెక్టర్‌
    ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌
    రీసెర్చ్‌ అసిస్టెంట్‌
    జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌/జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌
    ఆడిట్‌
    అకౌంటెంట్‌
    అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్‌
    పోస్టల్‌ అసిస్టెంట్‌/సారిటంగ్‌ అసిస్టెంట్‌
    సీనియర్‌ సెక్రెటేరియంట్‌ అసిస్టెంట్‌/అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌
    సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌
    టాక్స్‌ అసిస్టెంట్‌

    వేతనాలు ఇలా..
    ప్రస్తుత నోటిఫికేషన్‌లో వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్‌–బి, గ్రూప్‌–సిలో పలు హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన పోస్టు ప్రకారం.. లెవల్‌–4, లెవల్‌–5, లెవల్‌–6, లెవల్‌–7 శాలరీలు ఇస్తారు. మొదటి నెల నుంచే లెవల్‌ – 4 ఉద్యోగులకు రూ.45 వేలు, లెవల్‌–5 ఉద్యోగులకు రూ.55 వేలు, లెవల్‌ – 6 ఉద్యోగులకు రూ.65 వేలు, లెవల్‌ – 7 ఉద్యోగులకు రూ.80 వేల వేతనం ఇస్తారు.