https://oktelugu.com/

Duvvada Srinivas-Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి సర్ప్రైజ్ గిఫ్ట్ .. ఖరీదు ఎంతంటే?*

మరోసారి వార్తల్లో నిలిచారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఈ జంట మొన్న ఈ మధ్యన దీపావళి వేడుకలు జరుపుకుంది. తాజాగా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి మాధురి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 5, 2024 / 10:58 AM IST

    Duvvada Srinivas-Divvela Madhuri

    Follow us on

    Duvvada Srinivas-Divvela Madhuri : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. ఈ జంట గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో ఈ ఇద్దరు హైలైట్ గా నిలిచారు. హాట్ టాపిక్ అయ్యారు. కుటుంబ వివాదంలో అనూహ్యంగా దివ్వెల మాధురి పేరు తెరపైకి వచ్చింది. అటు తరువాత జరిగిన పరిణామాలు ఆసక్తి రేపాయి. వివాదం సద్దుమణిగిన ఈ జంట తరచూ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ జంట దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే తాజాగా జరిగిన దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో మాధురి మరోసారి హైలెట్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఓ వాచీ అందించారు. దాన్ని ధర రెండు లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారిపోయింది.సోషల్ మీడియాలో దీని ధరపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట ఈ జంట దీపావళి వేడుకలు జరుపుకుంది. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి కూడా.

    * తిరుపతిలో హల్ చల్
    మొన్న ఆ మధ్యన తిరుపతిలో ఈ జంట చేసిన హడావిడి అంతా కాదు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా వీరి పెళ్లిపై ఊహాగానాలు రేగాయి. దీనిపై దివ్వెల మాధురి క్లారిటీ కూడా ఇచ్చారు. కోర్టులో విడాకుల అంశం ఉందని.. తేలిపోయిన వెంటనే వివాహం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే మాధురి తిరుమలలో ఫోటోలకు దిగడం వివాదాస్పదం అయ్యింది. తిరుమలలో రీల్స్ చేయడం, సహజీవనం గురించి మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ టిటిడి విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా నమోదు అయింది. రాజకీయ కక్ష సాధింపుతోనే తమపై కేసులు నమోదు చేశారని మాధురి ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

    * ఆ ఇంట్లోనే వేడుకలు
    దువ్వాడ తన కొత్త ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కొంత మొత్తం మాధురి నుంచి రుణం తీసుకున్నానని.. దానికి గాను తన ఇంటిని రాసిచ్చానని చెప్పుకొచ్చారు శ్రీనివాస్. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ప్రస్తుతం దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. తాజాగా సన్నిహితుల మధ్య అదే ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఖరీదైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు మాధురి.