https://oktelugu.com/

New Courses : విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక కోర్సులు

Andhra University దరఖాస్తులను పెద్ద వాల్టేర్‌ ఐ హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో జూన్‌ 12 సాయంత్రం 5 గంటల వరకు అందించాలి.

Written By:
  • NARESH
  • , Updated On : June 6, 2024 9:50 pm
    Andhra Univercity

    Andhra Univercity

    Follow us on

    New Courses : నూతన విద్యా సవంత్సరం ప్రారంభమైంది. విద్యారంగంలో అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు విద్యా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ తాజాగ కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక కోర్సులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రవేశపెట్టింది.

    కొత్త కోర్సులు ఇవీ..
    ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్టు విధానంలో బీఎస్సీ(హానర్స్), ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్‌ డీఏ. నాయుడు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

    ఫీజు వివరాలు..
    ఈ కోర్సు ఫీజు రూ.65 వేలు ఉంటుంది. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. జూన్ 2వ తేదీ నుంచి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణకు జూన్ 12 వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులను పెద్ద వాల్టేర్‌ ఐ హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో జూన్‌ 12 సాయంత్రం 5 గంటల వరకు అందించాలి.

    ఎంపిక ఇలా..
    దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. 14వ తేదీన కౌనె‍్సలింగ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. నూతన విద్యావిధానం 2020లో పేర్కొన్న విధంగా ఈ కోర్సుకు మల్టీ ఎంట్రీ ఎగ్జిట్ అప్షన్ కల్పించినట్లు ప్రొఫెసర్‌ నాయుడు తెలిపారు.

    ఐదేళ్లు చదువొచ్చు..
    ఈ కొత్త కోర్సును ఐదేళు‍్ల చదవే అవకాశం ఉంటుంది. ఒక ఏడాది కోర్సు పూర్తి చేస్తే సర్టిఫికేట్, రెండేళ్ల కోర్సు పూర్తి చేస్తే డిప్లొమా, మూడేళ్ల కోర్సు పూర్తి చేస్తే బ్యాచిలర్ డిగ్రీ, నాలుగేళ్ల కోర్సు పూర్తిచేస్తే హానర్స్ డిగ్రీ, ఐదేళ్ల కోర్సు పూర్తి చేస్తే ఎమ్మెస్సీ డిగ్రీ అందిస్తారన్నారు