Sharwanand : టాలీవుడ్ లో ఉన్న టాలెంట్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేయడంలో దిట్ట అనే పేరు సంపాదించారు. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ఆడియన్స్ లో శర్వాకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ హీరో ఒకే ఒక జీవితం సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. అంతేనా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ హీరో తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం మనమే.
ఇందులో శర్వానంద్ కు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జతకట్టబోతుంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. ఇక సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు చిత్ర మేకర్స్. ఇందులో భాగంగా నిన్న సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహించడంతో శర్వానంద్, కృతి శెట్టి, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తదితర చిత్ర బృందమంతా హాజరయ్యారు.
దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ లు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ శర్వానంద్ కు ఓ బిరుదును అంకితం చేశారు. మెగాస్టార్, పవర్ స్టార్, రాక్ స్టార్, యూత్ స్టార్ ఉన్నట్లే .. శర్వానంద్ కు ఛార్మింగ్ స్టార్ అనే బిరుదును వచ్చేసింది. ఈయనకు సంబంధించిన సినిమా కెరీర్ పై ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కాగా మొదట మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ వేడుక హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.