Australia vs Oman : ఒమన్ పై కూడా సున్నా చుట్టావా.. ఇక నుంచి నిన్ను డకౌట్ల స్టార్ అని పిలుస్తాంలే..

ఐపీఎల్ చరిత్రలో మ్యాక్సీ పేరిట అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఏకంగా అతడు 18సార్లు డక్ అవుట్ అయ్యాడు.

Written By: NARESH, Updated On : June 6, 2024 8:25 pm

Glenn Maxwell Ducked Out in ICC T20 World Cup 2024 Match Against Oman

Follow us on

Australia vs Oman : అతడు మైదానంలో దిగితే సుడిగాలి కూడా భయపడిపోతుంది. సునామి కూడా వెనుకడుగు వేస్తుంది. బౌలర్లపై దీర్ఘకాలికంగా విరోధం ఉన్నట్టు అతడు ఆడతాడు. బంతి పై ఏమాత్రం కనికరం చూడకుండా బాదుతాడు. బౌలర్ ఎవరనేది చూడడు.. జట్టు ఏదనేది లక్ష్య పెట్టడు. అతడి అంతిమ లక్ష్యం కొట్టడం. కసితీరా బాదడం.. అతడి బ్యాటింగ్ దెబ్బకు కొండంత స్కోర్ కూడా కరిగిపోతుంది. అందుకే అతడిని వర్తమాన క్రికెట్లో భయంకరమైన బ్యాటర్ గా భావిస్తుంటారు. కానీ అలాంటి ఆటగాడు ఇప్పుడు తేలిపోతున్నాడు. సిక్స్, ఫోర్లు కొట్టిన ఆ మేటి ఆటగాడు సున్నా పరుగులతో పోటీ పడుతున్నాడు.

ఐపీఎల్ లో చెత్త ఆట తీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మాక్స్ వెల్.. టి20 వరల్డ్ కప్ లోనూ అదే వైఫల్యానికి కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ సీజన్లో ఎన్నో ఆశలతో బెంగళూరు జట్టు అతడిని కొనుగోలు చేస్తే.. కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. కష్టమే అయినప్పటికీ.. ఏదో ఒక దశలో జట్టును ఆదుకుంటాడని బెంగళూరు అతడిని కొనసాగించింది.. కానీ అతడు చెత్త ఆటతో బెంగళూరు ఆశలను మొత్తం గంగపాలు చేశాడు.

మాక్స్ వెల్ కు ఎలాంటి ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే వంటి చేత్తో మలుపు తిప్పే సామర్థ్యం ఉంటుంది.. కానీ అలాంటి ఆటగాడు ఇటీవల తేలిపోతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బెంగళూరు తరఫున ఐపీఎల్ లో విఫలమైనప్పటికీ.. టి20 వరల్డ్ కప్ లో చెలరేగుతాడని భావించి ఆస్ట్రేలియా జట్టు ఎంపిక చేసింది. అయినప్పటికీ అతడు తన లయను అందుకోలేకపోతున్నాడు. అంచనాలను తలకిందులు చేస్తున్నాడు.

ఇక గురువారం బార్బడోస్ వేదికగా ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే మ్యాక్సీ అవుట్ అయ్యాడు. ఒకే ఒక బంతి ఎదుర్కొని గోల్డెన్ డక్ గా పేవిలియన్ చేరుకున్నాడు. దీంతో కలిపి గత పది ఇన్నింగ్స్ లలో మాక్స్ వెల్ డక్ అవుట్ కావడం విశేషం. ఇదే క్రమంలో అతడు అత్యంత చట్టరికాడు నమోదు చేశాడు. మెన్స్ టి20 క్రికెట్లో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. సునీల్ న రైన్(44), అలెక్స్ హేల్స్ (43), రషీద్ ఖాన్ (33), మాక్స్ వెల్(33), స్టిర్లింగ్ (32) అత్యధిక సార్లు డక్ ఔట్ అయిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో మ్యాక్సీ పేరిట అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఏకంగా అతడు 18సార్లు డక్ అవుట్ అయ్యాడు.