School Holidays: పాఠశాలలకు వేసవి సెలవులు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. తెలంగాణ, ఏపీలో జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఏపీలో సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
కారణం ఇదే..
పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రవేశాలు కూడా చేపట్టింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. ఇందులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈమేరకు అమరావతిలో ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. జూన్ 12 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అదేరోజు వేసవి సెలవులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సెలవులు పొడిగించే అవకాశం ఉంది.
విద్యాశాఖ కార్యదర్శికి వినతి..
పాఠశాలల సెలవులను పొడిగించాలని టీపీపీ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ విద్యాశాఖను కోరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని కోరారు. జూన్ 12న సీఎం ప్రమాణ స్వీకారం ఉన్నందున పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయాలని విన్నవించారు.
రీఓపెన్ ఎప్పుడంటే..
సీఎం ప్రమాణ స్వీకారం, అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవులు కచ్చితంగా పొడిగిస్తారని తెలుస్తోంది. దీంతో దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపన్ తేదీ మారుతుందని సమాచారం. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒకరోజు తర్వాత అంటే జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో వర్షాల తీవ్రతను బట్టి స్కూళ్ల రీఓపెన్ తేదీ మారుతుందని తెలుస్తోంది. భారీ వర్షాలు ఉంటే.. ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు పొడిగించే అవకాశం ఉంది.