Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఆశ చావట్లే..! అసలు ఏమైంది..?

ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపడుతున్న వేళ..బిజెపిలోని ఓ సీనియర్ నేతకు పీఎం కావాలనే ఆశలు మాత్రం చావనట్లే కనిపిస్తున్నాయి. బిజెపిలో నితిన్ గడ్కరి చాలా సీనియర్ నాయకులు.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 10:38 am

Nitin Gadkari

Follow us on

Nitin Gadkari: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడమనేది లాంఛనమే. బిజెపికి 240 సీట్లు వచ్చినప్పటికీ..ఎన్డీఏ భాగస్వామిక పక్షాలు మోడీనే తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ మేరకు గురువారం హస్తినాలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు సమావేశమై మోడీ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ మేరకు 21 రాజకీయ పార్టీలు ఆయన లీడర్ షిప్ ను సపోర్ట్ చేస్తూ.. చేసిన సంతకాల కాపీని ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు.

అయితే ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపడుతున్న వేళ..బిజెపిలోని ఓ సీనియర్ నేతకు పీఎం కావాలనే ఆశలు మాత్రం చావనట్లే కనిపిస్తున్నాయి. బిజెపిలో నితిన్ గడ్కరి చాలా సీనియర్ నాయకులు. నరేంద్ర మోడీ కన్నా..గడ్కరి పార్టీలో సీనియర్ లీడర్. బిజెపి జాతీయ అధ్యక్షులుగా పని పనిచేశారు. గడ్కరితో పోలిస్తే.. నరేంద్ర మోడీ బిజెపిలో చాలా జూనియర్. అయినప్పటికిని ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోడీ అత్యంత వేగంగా పార్టీ.. పరిపాలనపై పట్టు సాధించగలిగారు. ఒక దశలో మోడీ లేకపోతే బిజెపి లేదన్నంత స్థాయిలో ఎదిగారు. ఈ నేపథ్యంలోనే మూడోదశలో కూడా బిజెపి మోడీ చరిష్మానే నమ్ముకొని ఎన్నికల రణక్షేత్రంలోకి దిగింది. అయితే ఈసారి 2019లో కాకుండా సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాదాపు 63 ఎంపీ స్థానాలను కోల్పోయింది.

దీంతో ఎన్నాళ్లుగానో వేచి చూసిన బంధానికి వేళాయే అన్నట్లు..బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న నితిన్ గడ్కరీ ఆశలు చిగురించినట్లే కనిపిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామిక పక్షాలు ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇప్పటికే ఎంపికైనప్పటికీ.. గడ్కరి మాత్రం తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నాగపూర్ కేంద్రంగా కీలకమైన ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల నితిన్ గడ్కరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు. త్వరలోనే మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సీట్లను సాధించగలిగింది. ఇండియా అలయన్స్ అతి ఎక్కువ సీట్లలో గెలుచుకుంది. ఏకంగా ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఇక్కడ 13 మంది గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలోనే రాబోయే మహారాష్ట్ర ఎన్నికలు..ప్రస్తుత బిజెపి పరిస్థితి దృష్ట్యా తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నేతలకు చెబుతున్నారు. అయితే గడ్కరి విజ్ఞప్తులను వారు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే సరైన అభ్యర్థని నితిన్ గడ్కరీకి క్లారిటీ ఇచ్చేశారు. అయితే అన్ని రకాల ద్వారాలు మూసుకుపోయినప్పటికీ.. గడ్కరి మాత్రం తన ఆశలను వదులుకోకుండా దింపుడు గల్ల ప్రయత్నాలను చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి.