
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లకు ఏకంగా 16,000 రూపాయలు స్టైఫండ్ అందిస్తోంది. ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ ను ఎన్జీవోల సహాయంతో నిర్వహిస్తోంది. https://youthforindia.org/ వెబ్ సైట్ ద్వారా స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ స్టైఫండ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల గురించి అవగాహనను కలిగి ఉండాలి. 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 100కు పైగా ఫెలోషిప్ ఖాళీలు ఉండగా ఫెలోషిప్ వ్యవధి 13 నెలలుగా ఉంటుంది.
ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ స్టైఫండ్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2021 సంవత్సరం ఏప్రిల్ 30 ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్న 16,000 రూపాయల స్టైఫండ్ తో పాటు అలవెన్సుల కింద 50,000 రూపాయలు లభిస్తుంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది.