‘ప్రభాస్’కి అమ్మగా ఒకప్పటి హాట్ బ్యూటీ సీనియర్ స్టార్ హీరోయిన్ ‘రేఖ’ నటించబోతున్నట్లు తెలుస్తోంది. వినడానికి డౌట్ గా ఉన్నా.. ఈ వార్త నిజమే అంటూ.. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో కూడా టాక్ నడుస్తోండటంతో ఈ వార్త పై నమ్మకం కలుగుతుంది. ఇంతకీ, రేఖ ఏ సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటిస్తోంది అంటే.. ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అట. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. అమితాబ్ కి భార్యగానే రేఖను తీసుకున్నారని.. వీరిద్దరిది హాట్ పెయిర్ కాబట్టి.. ఆ రకంగా సినిమాకి బాగా ప్లస్ అవుతుందని అందుకే మేకర్స్ రేఖను తల్లి పాత్రలో తీసుకున్నారని.. భర్త నుండి వీడిపోయాక కొడుకుని గొప్ప యోధుడిగా తీర్చిదిద్దిన తల్లి పాత్రలోనే రేఖ కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: అదనంగా డబ్బులు ఇస్తేనే ముద్దులు పెడతాను !
అయితే రేఖ గత కొంతకాలంగా రెగ్యులర్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ, మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర వస్తే.. ఆ పాత్రను చేస్తోంది. కాగా భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన తల్లి పాత్రకు రేఖ అయితేనే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అయి.. ఎన్నో విధాలుగా కన్వీన్స్ చేసి ఆమెను ఫైనల్ చేశారట. ఏది ఏమైనా కొన్ని నిముషాల పాత్ర కోసం రేఖను తీసుకున్నారంటే మాములు విషయం కాదు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా ఎమోషన్ ఓ రేంజ్ లో.. !
ఇక ఈ పాత్ర కోసం రేఖ గట్టిగానే డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేకర్స్ కూడా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారని.. ఎలాగూ, నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ కావడంతోనే.. రేఖకు రెండు కోట్ల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోణే నటిస్తోంది. ఆమెకు కూడా భారీగానే ముట్టజెబుతున్నారని టాక్. పైగా సినిమాకి దీపికా పాత్ర చాలా ఇంపార్టెంట్ అట. ఏది ఏమైనా ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న పాత్రలకు పెద్ద వాళ్లనే తీసుకుంటూ మేకర్స్ కాస్త డేర్ గా ముందుకు వెళ్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్