
ఆర్‌ఈసీ పవర్ డెవలప్ మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. మొత్తం 29 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం. సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సివిల్, ఎఫ్ అండ్ ఏ, కాంట్రాక్ట్–ప్రొక్యూర్‌మెంట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెటీరియల్ ఇన్‌స్పెక్షన్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు పనిలో కచ్చితంగా అనుభవం ఉండాలి. 35 సంవత్సరాల వయస్సు నుంచి 48 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ చేయడంతో పాటు తుది ఎంపిక జరుగుతుంది. ఈ నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. https://www.recpdcl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 62,000 రూపాయల నుంచి 1,35,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.