Top-Up Loan: మనలో చాలామంది అవసరాలకు అనుగుణంగా రుణాలను తీసుకుంటూ ఉంటారు. హోమ్ లోన్ తీసుకున్న వాళ్లలో చాలామంది మళ్లీ లోన్ అవసరమైతే గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే తీసుకున్న హోమ్ లోన్ పై టాప్ అప్ లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం టాప్ అప్ లోన్ ను అందిస్తుండటం గమనార్హం.
తీసుకున్న రుణానికి అదనంగా పొందే రుణాన్ని టాప్ అప్ లోన్ అని అంటారు. ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్లకు టాప్ అప్ లోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. సాధారణంగా గృహ రుణానికి ఎంత వడ్డీరేటు ఉంటుందో టాప్ అప్ లోన్ కు కూడా అంతే మొత్తం వడ్డీరేటు ఉంటుందని చెప్పవచ్చు. హోమ్ లోన్ చెల్లించడం మొదలుపెట్టిన కొన్ని నెలల తర్వాత టాప్ అప్ లోన్ ను తీసుకోవచ్చు.
Also Read: పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటుకున్నారా.. పాటించాల్సిన రూల్స్ ఇవే!
గృహ రుణం నుంచి తీసుకున్న మొత్తానికి చెల్లించిన మొత్తాన్ని టాప్ అప్ లోన్ గా పొందే అవకాశం అయితే ఉంటుంది. హోమ్ లోన్ కోసం తీసుకున్న మొత్తంలో ఎంత ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే అంత ఎక్కువ మొత్తం పన్ను బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్లకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.
ఉద్యోగస్తులకు, వ్యాపారులకు టాప్ అప్ లోన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక నిపుణులు సైతం ఉద్యోగులు, వ్యాపారులు టాప్ అప్ లోన్స్ పై దృష్టి పెడితే మంచిదని సూచనలు చేస్తున్నారు. గృహ రుణం వడ్డీరేటు ఈ లోన్ కు కూడా అమలవుతుంది కాబట్టి లోన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: టాటాలు స్థాపించి.. తిరిగి టాటాల వద్దకే.. ఎయిర్ ఇండియా ప్రస్థానం..