పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త చెప్పింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు సబ్ స్టేషన్లు, కంస్ట్రక్షన్ సైట్స్ తో పాటు పవర్ గ్రిడ్ ఆఫీస్ లలో పని చేయాల్సి ఉంటుంది.
Also Read: డిగ్రీ పాసైన వాళ్ళకు శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు..?
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మొదటి ఏడాది ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరైతే సక్సెస్ ఫుల్ గా విధులను నిర్వహిస్తారో వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ గా ఈ ఉద్యోగాల కోసం నియమింపబడతారు. ఈ ఉద్యోగాలకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.
మొత్తం 40 ఉద్యోగ ఖాళీలలో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్, ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ సివిల్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంగా 20 ఖాళీలు ఉండగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఇంజనీరింగ్ లో బీటెక్, బీఎస్సీ, బీఈ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 10 ఖాళీలు ఉండగా బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఆర్మీలో ఉద్యోగాలు..?
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ సివిల్ ఉద్యోగ ఖాళీలు 10 ఉండగా బీఈ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉండి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా https://www.powergridindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.