Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజకమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ మీడియా కి విడుదల చేయలేదు మూవీ టీం. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్న #RRR మూవీ పూజ కార్యక్రమాలను సైతం మీడియా కి వదిలిన టీం, ఈ సినిమాకి ఎందుకు వదలలేదు ?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతోందని రాజమౌళి ఇది వరకే తెలియచేశాడు. ఇప్పటి వరకు ఇండియా లో ఈ జానర్ మీద సినిమాలు తెరకెక్కలేదు. అయితే నేపథ్యం ఏమిటి?, కథ ఏమిటి? అనేది రాజమౌళి తన ప్రతీ సినిమాకి చెప్పేవాడు.
కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా గోప్యంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా కొన్ని యుద్ధ విద్యలను నేర్చుకున్నాడట. జపాన్ దేశం లో కొన్ని రోజులు ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న మహేష్ బాబు, త్వరలోనే ఒక 20 రోజుల పాటు ఆఫ్రికన్ లో ఉన్నటువంటి పలు తెగలకు సంబంధించిన జనాల మధ్య గడపబోతున్నారట. వారి ఆహారపు అలవాట్లు, దినచర్య, సంస్కృతి సంప్రాదయాలు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాడట. అంతే కాకుండా ఈ ఏడాది ద్వితీయార్థం లో ఆయన చైనా దేశం లో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ప్రత్యేక నిపుణులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లో చేరి, మార్షల్ ఆర్ట్స్ లో మరింత ప్రావిణ్యం పెంచబోతున్నారని తెలుస్తుంది.
మహేష్ బాబు ఈ చిత్రం కోసం సిద్ధం అవ్వడానికి దాదాపుగా రెండేళ్ల సమయం పట్టింది. ఇక షూటింగ్ కి ఎన్ని రోజుల సమయం పడుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం లో షూటింగ్ మొదలు అవుతుందని అభిమానులు ఆశపడితే, ఇంకా ట్రైనింగ్ దశలోనే ఉన్నాడని తెలుసుకొని ఆనందపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి కి వెళ్లిపోయారు. అంటే షూటింగ్ పూర్తి అవ్వడానికి మూడేళ్ల సమయం కాదు, ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మహేష్ బాబు అభిమానులు అన్ని రోజులు తమ అభిమాన హీరోని వెండితెర మీద చూడకుండా ఉండగలరా లేదా అనేది చూడాలి. ఇంత సమయం తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం టార్గెట్ ఇండియన్ రికార్డ్స్ కాదు, హాలీవుడ్ రికార్డ్స్. అవతార్ సిరీస్, మార్వెల్ మరియు DC సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు మహేష్ తో కూడా అలాంటి సినిమానే చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.