https://oktelugu.com/

62 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 62 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌డ‌బ్ల్యూడీఏ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియ‌ర్ ఇంజినీర్‌, హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు జూన్ 25వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. http://nwda.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం సులభంగా దరఖాస్తు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 23, 2021 / 09:19 AM IST
    Follow us on

    నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 62 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌డ‌బ్ల్యూడీఏ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియ‌ర్ ఇంజినీర్‌, హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు జూన్ 25వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

    http://nwda.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 62 ఉద్యోగ ఖాళీలలో లోవ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ 23, అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ 12, జూనియ‌ర్ ఇంజినీర్ 16, జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీసర్ 5, స్టెనోగ్రాఫ‌ర్ 5, హిందీ ట్రాన్స్‌లేట‌ర్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. ఉద్యోగాలను బట్టి విద్యార్హతలు వేరుగా ఉన్నాయి.

    ఇంట‌ర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఎగ్జామ్, కంప్యూట‌ర్ స్కిల్ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, ఈడ‌బ్ల్యూఎస్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.

    ఈ అభ్యర్థులు కాకుండా మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 800 రూపాయలుగా ఉంది. మే 10వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 25 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.