Homeఎంటర్టైన్మెంట్వ్యాక్సిన్ వేయించుకున్న 28 ఏళ్ల స్టార్ హీరోయిన్ !

వ్యాక్సిన్ వేయించుకున్న 28 ఏళ్ల స్టార్ హీరోయిన్ !

Keerthy Suresh28 ఏళ్ల కీర్తి సురేష్ మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ అందించడంలో విఫలమవడానికి పోటీ పడ్డారు గాని, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి చోట్ల 18-45 ఏళ్ళ వయస్సు వారికి కూడా వ్యాక్సిన్ ను సమకూరుస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. కాకపోతే ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రిల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది.

కోట్లు సంపాదించే హీరోయిన్స్ కి ఏ హాస్పిటల్ అయితే ఏం ? చక్కగా బుక్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటికే నయనతార, త్రిష వంటి హీరోయిన్లు వ్యాక్సిన్ వేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త బాగా వైరల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా చేరింది. పైగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవడానికి కేరళ నుండి వెళ్ళింది.

కేరళలో కూడా వ్యాక్సిన్ సరిగ్గా అందుబాటులో లేదు. అక్కడి ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ అందచ లేకపోవడంలో తెలుగు ప్రభుత్వాలకు గట్టి పోటీనిస్తోంది. కాకపోతే ఈ విషయంలో దేశంలో తెలుగు రాష్ట్రాలను మించినోళ్లే లేరనట్టు ఉంది మన ముఖ్యమంత్రుల పనితీరు. అయినా ముందుచూపు లేని నాయకత్వం వల్ల, వచ్చిన ఆపదను అర్ధం చేసుకోలేని అధికారం వల్ల,

ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చలేని ప్రభుత్వాల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కొరత పై దృష్టి పెట్టి, కరోనా సోకి సరైన వైద్యం లేక అల్లాడిపోతూ ప్రాణాలను పోగొట్టుకున్న అభాగ్యులను ఆదుకుంటే.. పేదల ఆక్రోశం కొంతైనా తగ్గుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version