Jobs: హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. నెలకు లక్షన్నర వేతనంతో?

Jobs: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పరిమిత సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గ్యాస్ సేఫ్టీ, సేఫ్టీ విభాగాలతో పాటు ఫైర్ సర్వీసెస్, ఎన్విరాన్ మెంట్ ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ […]

Written By: Navya, Updated On : April 8, 2022 3:02 pm
Follow us on

Jobs: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పరిమిత సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గ్యాస్ సేఫ్టీ, సేఫ్టీ విభాగాలతో పాటు ఫైర్ సర్వీసెస్, ఎన్విరాన్ మెంట్ ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ అర్హతతో పాటు సీఏ, లా డిగ్రీ, పీజీ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. అకాడమిక్ మెరిట్ ద్వారా ఎంపికైన వాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా 60,000 రూపాయల వేతనం లభించనుండగా గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు వేతనం లభించనుంది.

కొన్నిరోజుల క్రితమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా 2022 సంవత్సరం ఏప్రిల్ 25 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.