NIOS Recruitment 2021: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. 115 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
మొత్తం 115 ఉద్యోగ ఖాళీలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 36 ఉండగా ఈడీపీ సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు 37 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 3, అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 1, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు1 , హిందీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 1, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 1, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 7, రిసెర్చ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ 1, అకడమిక్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలున్ 1, అసిస్టెంట్ ఆఫీసర్ 1, డిప్యూటీ డైరెక్టర్ 1, జూనియర్ డైరెక్టర్ 1, డైరెక్టర్ 1 ఉన్నాయి.
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://nios.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకసారి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులో ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఒక ఉద్యోగ ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులను పంపాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉండటంతో అభ్యర్థులు సిద్ధంగా ఉంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 1,23,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.