https://oktelugu.com/

నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్‌) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 275 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నిమ్‌హాన్స్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. దరఖాస్తులకు జూన్ 28వ తేదీ చివరి తేదీ కాగా https://nimhans.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 31, 2021 / 11:00 AM IST
    Follow us on

    బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్‌) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 275 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నిమ్‌హాన్స్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

    దరఖాస్తులకు జూన్ 28వ తేదీ చివరి తేదీ కాగా https://nimhans.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం 275 ఉద్యోగ ఖాళీలలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 266 ఉండగా టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ) 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులర్) 1, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్ 1, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ 3 ఉన్నాయి.

    సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనెటిక్స్) ఉద్యోగ ఖాళీలు 1, అసిస్టెంట్ డైటీషియన్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతను బట్టి 35,400 రూపాయల నుంచి 67,700 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్- ఏ పోస్టులకు దరఖాస్తు ఫీజు 2,360 రూపాయలు కాగా మిగిలిన పోస్టులకు 1,180 రూపాయలుగా ఉంది.

    ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ బెంగళూరు అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.