
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ నోటిఫికేషన్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 10 ఖాళీలు ఉండగా ఈ ఖాళీలలో మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలు 7 ఉంటే ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్ లో అర్హత సాధించిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,000 రూపాయలు వేతనం లభిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు హైదరాబాద్ లోకి ఆఫీస్ అడ్రస్ కు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
2021 సంవత్సరం జూన్ 14వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్రస్‌కు పోస్టులో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.