https://oktelugu.com/

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..?

నేష‌న‌ల్ హైస్పీడ్ రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 61 ఉద్యోగాల భర్తీకి అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. 61 ఉద్యోగ ఖాళీలలో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 60 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం 1 ఉంది. ఎల‌క్ట్రిక‌ల్‌, జ‌న‌ర‌ల్, సివిల్‌, ఎస్‌&ఐ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..? ఇప్పటికే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2020 / 08:56 AM IST
    Follow us on


    నేష‌న‌ల్ హైస్పీడ్ రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 61 ఉద్యోగాల భర్తీకి అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. 61 ఉద్యోగ ఖాళీలలో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 60 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం 1 ఉంది. ఎల‌క్ట్రిక‌ల్‌, జ‌న‌ర‌ల్, సివిల్‌, ఎస్‌&ఐ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nhsrcl.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీలోగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

    Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. 1004 అప్రెంటీస్‌ ఉద్యోగాలు..?

    డిగ్రీ, బీటెక్ చదివి సంబంధిత సబ్జెక్టుల్లో పాస్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉండగా మూడు దశల్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హులవుతారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో పాటు అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కావడంతో భారీ వేతనం పొందినా కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాత ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది.