నేషనల్ హెల్త్ మిషన్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 29 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఉద్యోగ ఖాళీలతో పాటు డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ పాసై సంబంధిత పనిలో కనీసం సంవత్సరం పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల చొప్పున వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎంబీఏ (ఫైనాన్స్)/ఎంకాం పాసై అనుభవంతో పాటు కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పవచ్చు.
34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు కూడా అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కేవలం 25,000 రూపాయలు మాత్రమే వేతనంగా లభించనుంది. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉండనుంది. https://chfw.telangana.gov.in/home.do వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
[…] Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ‘ఉయ్యాలా జంపాలా’ అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి ఫాలోయింగ్ సాధించింది. కానీ, పాపకు కాలం కలిసి రాలేదు. వరుస హిట్లు వచ్చి ఉంటే.. స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ.. హిట్ మాట దేవుడెరుగు ? ఆమెకు అన్నీ సమస్యలే. అందుకే.. అవికా గోర్ కెరీర్ చాలా అయిపోయింది. […]