https://oktelugu.com/

వైద్యులు తెల్ల కోట్ ఎందుకు ధరిస్తారు.. కారణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

మనలో ప్రతి ఒక్కరూ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదిస్తారనే సంగతి తెలిసిందే. వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని మందులు వాడితే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. అయితే వైద్యులు ఎప్పుడూ తెల్ల కోట్ ను మాత్రమే ధరిస్తారు. ఈ విధంగా వైద్యులు వైట్ కోట్ ను ధరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. వైద్యులతో పాటు ఆస్పత్రిలో పని చేసే ఇతర సిబ్బంది కూడా వైట్ డ్రెస్ నే ధరిస్తారు. చాలా సంవత్సరాల నుంచి వైద్యులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 31, 2022 / 03:40 PM IST
    Follow us on

    మనలో ప్రతి ఒక్కరూ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదిస్తారనే సంగతి తెలిసిందే. వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని మందులు వాడితే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. అయితే వైద్యులు ఎప్పుడూ తెల్ల కోట్ ను మాత్రమే ధరిస్తారు. ఈ విధంగా వైద్యులు వైట్ కోట్ ను ధరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. వైద్యులతో పాటు ఆస్పత్రిలో పని చేసే ఇతర సిబ్బంది కూడా వైట్ డ్రెస్ నే ధరిస్తారు.

    చాలా సంవత్సరాల నుంచి వైద్యులు తెల్ల కోట్ ను ధరించడం జరుగుతోంది. డాక్టర్ ప్రొఫెషన్ కు తెల్ల కోటు సింబల్ అని చెప్పవచ్ఛు. డాక్టర్లు వైట్ డ్రెస్ ధరించడం ద్వారా రోగులకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పటికీ డాక్టర్ కు ఆ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. వైట్ కోట్ కు రక్తం లేదా ఏవైనా కెమికల్స్ అంటుకున్నా సులువుగా గుర్తించే వీలవుతుంది.

    పరిశుభ్రతకు వైట్ కలర్ సింబాలిక్ అనే సంగతి తెలిసిందే. తెల్లటి రంగు దుస్తుల్లో ఉన్న వైద్యులను చూస్తే రోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. తెలుపురంగు దుస్తులు తెలివితేటలకు ప్రతీక అనే సంగతి తెలిసిందే. తెలుపురంగు దుస్తులను ధరించడం వల్ల వైద్యులు, వైద్య సిబ్బందిని రోగులు సులభంగా గుర్తించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

    19వ శతాబ్దం నుంచి వైద్యులు తెలుపురంగు దుస్తులను ధరిస్తున్నారని తెలుస్తోంది. వైద్యులు తెల్ల కోట్ ధరించడం వెనుక ఉన్న కారణాల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.