నేషనల్ హెల్త్ మిషన్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 29 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఉద్యోగ ఖాళీలతో పాటు డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ పాసై సంబంధిత పనిలో కనీసం సంవత్సరం పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల చొప్పున వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎంబీఏ (ఫైనాన్స్)/ఎంకాం పాసై అనుభవంతో పాటు కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పవచ్చు.
34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు కూడా అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కేవలం 25,000 రూపాయలు మాత్రమే వేతనంగా లభించనుంది. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉండనుంది. https://chfw.telangana.gov.in/home.do వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.